Donald Trump : భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన గొడవను తానే ఆపించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చెప్పారు. రెండు దేశాలు పోరాటం ఆపకపోతే భారీ పన్నులు వేస్తానని హెచ్చరించడంతోనే కాల్పులు ఆగిపోయాయని ఆయన అన్నారు. భారత్, పాకిస్థాన్ రెండూ అణ్వాయుధాలు ఉన్న దేశాలని, అందుకే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారకుండా రెండు దేశాలు పోరాటం ఆపాలని తాను చెప్పినట్లు ట్రంప్ తెలిపారు.

Also Read : పాకిస్తాన్‌ను ముంచేస్తున్న LNG సంక్షోభం: చీకట్లో పొరుగు దేశం!

మీరు ఇద్దరూ ఇలా పోరాడుతుంటే.. అమెరికాతో వ్యాపారం చేయలేరు. మీ రెండు దేశాలపై 250 శాతం భారీ పన్నులు వేస్తాను. అప్పుడు అమెరికాతో ఎలాంటి వ్యాపారం చేయలేరు అని తాను హెచ్చరించినట్లు ట్రంప్ చెప్పారు. తన మాటలకు భారత్, పాకిస్థాన్ మొదట చాలా కోపంగా స్పందించాయని ట్రంప్ అన్నారు. అయితే ఆ తర్వాత కాల్పులు ఆపేశాయని, దీంతో యుద్ధం ముగిసిందని చెప్పారు. ఈ గొడవలో 11 విమానాలు కూలిపోయాయని కూడా ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఆ విమానాలు ఎవరివి, ఎలా కూలిపోయాయి అనే విషయంపై మాత్రం ఆయన మరిన్ని వివరాలు చెప్పలేదు. నేను ఇలాంటి ఎన్నో యుద్ధాలను ఆపించాను. అలా చేయడం నాకు గౌరవంగా ఉంది అని ట్రంప్ అన్నారు.

ఇప్పటికే పలు దేశాల మధ్య గొడవలను ఆపించడంలో తాను కీలక పాత్ర పోషించానని ఆయన మరోసారి చెప్పారు. తన ప్రయత్నాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రాకపోవడంపై కూడా ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే భారత్ మాత్రం ట్రంప్ చేసిన ఈ వాదనలను ఎప్పటికప్పుడు ఖండిస్తోంది. ముఖ్యంగా గొడవ సమయంలో 11 విమానాలు కూలిపోయాయన్న ట్రంప్ మాటలను భారత్ తిరస్కరించింది. అలాగే భారత్-పాక్ మధ్య సమస్యల్లో మూడో దేశం జోక్యం చేసుకోవడాన్ని కూడా భారత్ అంగీకరించదు. ఆపరేషన్ సింధూర్ సమయంలో కాల్పులు ఆపే నిర్ణయం ఎలా జరిగిందనే విషయంలో భారత్ ఇప్పటికే తన వాదనను స్పష్టంగా చెప్పింది.

Also Read : US సరిహద్దుల్లో ‘హీట్ రే’ కలకలం: జనాలకు కరెంటు పెడుతున్న ఆర్మీ!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.