Iran: దీంతో ఇరు దేశాల మధ్య ఆందోళనలు చెలరేగాయి. అయితే ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిలో కూడా ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఈ మార్గం ప్రపంచ వాణిజ్యానికి ఎంతో ముఖ్యమైనది. హోర్మూజ్ కొన్ని గంటల పాటు క్లోజ్ అయితే ప్రపంచ వ్యాప్తంగా చమురు, బంగారం వంటి ధరలు భారీగా పెరుగుతాయి. అయితే ప్రస్తుతం ఇరాన్, అమెరికా ఒకదానిపై దాడులు చేసుకోవడంతో ఉద్రిక్తలు పెరిగాయి. హోర్మూజ్‌ను తన ఆధీనంలోకి తీసుకోవడానికి అమెరికా శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. భవిష్యత్తులో అమెరికాతో తాము శాంతి చర్చలు జరపాలంటే.. తప్పకుండా మూడు షరతులను ఒప్పుకోవాలని తెలిపింది.

Also Read : సౌదీలో అతిపెద్ద రిఫైనరీపై హూతీల భారీ దాడి.. చమురు ఉత్పత్తికి బ్రేక్

హోర్ముజ్‌పై తమకు పూర్తి హక్కు కావాలని ఇరాన్ కండిషన్ పెట్టింది. హోర్ముజ్ జలసంధి ప్రాంతంపై ఇరాన్‌కు మాత్రమే సంపూర్ణ నియంత్రణ, హక్కు ఉందని అమెరికా అధికారికంగా అంగీకరించాలి. అప్పడే భవిష్యత్తులో తాము అమెరికాతో శాంతి చర్చలకు ఒప్పుకుంటామని షరతు పెట్టింది. అలాగే వివిధ ఆంక్షల పేరుతో ఫ్రీజ్ చేసిన ఆస్తులను వెంటనే విడుదల చేయాలి. అమెరికాతో పాటు దాని మిత్రదేశాలు ఫ్రీజ్ చేసిన వాటిని విడుదల చేయాలని ఇరాన్ తెలిపింది. ఇక ఈ రెండు షరతులకు ఒప్పుకుని వీటిని పూర్తి చేసిన తర్వాతే తమ అణు కార్యక్రమానికి సంబంధించిన అన్ని అంశాలపై అమెరికాతో మాట్లాడతామని ఇరాన్ స్పష్టం చేసింది. అలాగే హోర్ముజ్ ప్రాంతానికి ప్రత్యామ్నాయంగా వేరే నౌకా రవాణా మార్గాలను లేదా ఒప్పందాలను ఏర్పాటు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించబోమని ఇరాన్ తెగేసి చెప్పింది. తమ అనుమతి లేనిదే ఆ ప్రాంతంలో ఒక పక్షి కూడా ఎగరలేదని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించాయి. అయితే మధ్యప్రాచ్యంలో మరో పెద్ద యుద్ధాన్ని నివారించేందుకు ఒమన్, పాకిస్తాన్ వంటి దేశాల మధ్యవర్తిత్వంతో జెనీవా, దోహా లేదా ఇస్లామాబాద్ నగరాల్లో దౌత్యపరమైన చర్చలు జరిపేందుకు ఇరాన్ పాజిటివ్‌గా స్పందించింది.

ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు ఈ సముద్ర మార్గం గుండానే సాగుతుంది. ఇక్కడ ఏ చిన్న ఘర్షణ జరిగినా లేదా రవాణా నిలిచిపోయినా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్నంటి, అంతర్జాతీయంగా తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ విధించిన షరతులను యాక్సెప్ట్ చేస్తుందో లేదో చూడాలి.

Also Read : బెర్లిన్ వార్షిక LGBTQ+ వేడుకల్లో అపశృతి.. దూసుకొచ్చిన వ్యాన్ ఒకరి మృతి పలువురికి గాయాలు