
అమెరికా, ఇరాన్ దేశాల వార్ రోజురోజుకు ముదురుతోంది. తాజాగా ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తో రిలేషన్ ఉన్న ఓ న్యూస్ ఏజెన్సీ సంచలన వీడియోను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ వీడియోలో ట్రంప్ భార్య మెలానియాకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను, ఆమె తరచుగా సందర్శించే ప్రదేశాలను ప్రత్యేకంగా చూపించారు. ఆమెకు ఇష్టమైన ప్రదేశాలు, ఎక్కువగా షాపింగ్ చేసే విలాసవంతమైన ప్లేస్‌లు వీడియోలో పాయింట్ అవుట్ చేశారు. అయితే “మెలానియాను ఎక్కడ చంపాలి?” అనే క్యాప్షన్ పెట్టి ఈ వీడియో విడుదల చేశారు. ఆమెను టార్గెట్ చేసి ఈ వీడియో విడుదల చేశారు. అయితే ఈ బెదిరింపులు కేవలం మెలానియాతోనే ఆగలేదు.
Also Read : జపాన్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు!
Tasnim News Agency, affiliated with Iran’s Revolutionary Guards, published a video identifying locations frequented by US First Lady Melania Trump and encouraging “freedom fighters” and supporters of the Islamic Republic to kill her. The video highlighted places she visits,… pic.twitter.com/ExzvGOw3gs
— Wladimir van Wilgenburg (@vvanwilgenburg) July 27, 2026
డొనాల్డ్ ట్రంప్ కుమారుడు బారన్ ట్రంప్‌ను కూడా టార్గెట్ చేసినట్లు ఈ వీడియో ద్వారా అర్థమవుతుంది. వీడియో ఎండింగ్‌లో బారన్ ట్రంప్ చిత్రాన్ని చూపిస్తూ Wait for us అని తెలిపారు. దీంతో అమెరికా భద్రతా వర్గాలు భయాందోళనకు గురవుతున్నాయి. అమెరికా దేశాధినేత కుటుంబాన్ని ఇలా బహిరంగంగా చంపేస్తామని వార్నింగ్ ఇవ్వడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ వార్నింగ్ తీవ్ర పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికా, ఇరాన్ వార్ తీవ్రంగా మారింది. ఈ వార్నింగ్‌తో మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయడం ఖాయమని అంటున్నారు.
అయితే ఈ వీడియోను ప్రసారం చేసిన న్యూస్ ఏజెన్సీ అధికారిక ప్రభుత్వ మీడియా కాదు. కానీ ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్’ (IRGC) తో దీనికి బలమైన సంబంధాలు ఉన్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య సైనిక ఘర్షణలు కొనసాగుతున్న సమయంలో ఈ వీడియో రావడం సంచలనం రేపుతోంది. అయితే దీనిపై ఇరాన్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Also Read : పీవోకేలో పాక్ ఆర్మీ అరాచకం.. కరెంట్ అడిగితే కాల్పులు.. 19 మంది మృతి









