Mojtaba Khamenei
Mojtaba Khamenei

Mojtaba Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ అసలు బతికే ఉన్నారా లేదా? అనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇజ్రాయెల్, అమెరికా జరిపిన భీకర దాడుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారనే వార్తలు వచ్చినప్పటి నుంచి ఆయన ఒక్కసారి కూడా బహిరంగంగా ప్రజల ముందుకు రాలేదు. ఈ క్రమంలో ఇటీవల ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో ఆయన అత్యంత రహస్యంగా సమావేశమయ్యారని తెలుస్తోంది.

Also Read : కిమ్ మరో సంచలనం.. కుక్క మాంసం సూప్ తాగాలని ఆదేశాలు.. నార్త్ కొరియాలో అసలేం జరుగుతోంది?

ఇరాన్‌లో ప్రస్తుతం అంతర్గత రాజకీయ సంక్షోభం తలనెత్తింది. ఇరాన్ పారామిలిటరీ బలగాలైన ఐఆర్‌జీసీ తీరుపై అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సైనిక దళాల నిర్ణయాలు, విధానాల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన ఆయన.. ఏకంగా తన పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. దేశంలో యుద్ధ వాతావరణం, ఆర్థిక సంక్షోభం నెలకొన్న వేళ అధ్యక్షుడి రాజీనామా హెచ్చరిక ఇరాన్ రాజకీయాన్ని తీవ్రంగా ఊపేసింది. ఈ నేపథ్యంలో సుప్రీం లీడర్‌తో పెజెష్కియాన్ భేటీ అవ్వడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read : ఇంగ్లిష్ ఛానెల్‌లో బోటుకు నిప్పు…స్పాట్‌ లో 157 మంది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఒక అత్యంత రహస్య ప్రాంతంలో ఈ ఇద్దరి సమావేశం జరిగినట్లు ఇరాన్ స్థానిక మీడియా తెలిపింది. ఈ భేటీ జరిగిన తీరు అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. ముదురు రంగు అద్దాలు ఉన్న ఓ కారు వెనుక సీట్లో మొజ్తాబా ఖమేనీ కూర్చోగా, పెజెష్కియాన్ ఆయనతో భేటీ అయినట్లు తెలుస్తోంది. అయితే కారు లోపల ఎదురుగా ఉన్న మనిషి ముఖం కూడా సరిగ్గా కనిపించనంత కమ్మటి చీకటి వాతావరణంలో ఈ సమావేశం నిర్వహించారు. కనీసం వారిద్దరూ షేక్ హ్యాండ్ కూడా చేసుకోలేదని సమాచారం.

ఎదురుగా ఉన్న వ్యక్తి రూపురేఖలు కూడా స్పష్టంగా కనిపించకపోవడం, ఎలాంటి భౌతిక స్పర్శ లేకపోవడంతో పెజెష్కియాన్‌ను కలిసింది నిజంగానే సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీయేనా లేక ఆయన డ్యూప్ నా అనే సందేహాలు మొదలయ్యాయి. దాడుల్లో ఖమేనీ తీవ్రంగా గాయపడి మరణించి ఉంటారని, లేదా కోమాలో ఉండి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆ విషయాన్ని ప్రపంచానికి తెలియకుండా దాచడానికే ఇరాన్ ఐఆర్‌జీసీ బలగాలు ఈ నాటకం చేస్తోందని నిపుణులు అనుమానిస్తున్నారు. ఇరాన్ అధ్యక్షుడి రాజీనామాను ఆపడానికి దేశంలో పాలన సజావుగానే సాగుతోందని నమ్మించడానికి ఈ చీకటి భేటీ ఏర్పాటు చేశారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈ భేటీ సందర్భంగా మొజ్తాబా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిపై ప్రధానంగా చర్చించారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో తాను చనిపోయినట్లు వస్తున్న వార్తలను మొజ్తాబా ఖమేనీ తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్‌ను అంతమొందించే వరకు తాను చనిపోయేదే లేదని ఆయన పెజెష్కియాన్‌ వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తన ఆరోగ్యంపై వస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ.. త్వరలోనే ప్రజల ముందుకు వచ్చి మాట్లాడతానని వెల్లడించారు.