donald Trump

అమెరికా, ఇరాన్‌ల మధ్య వార్ ముదురుతోంది. ఈ సమయంలో కూడా టెహ్రాన్ ప్రభుత్వం వాషింగ్టన్‌తో జరుపుతున్న చర్చలను ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నప్పటికీ.. ఇరాన్‌పై పెద్ద ఎత్తున సైనిక దాడులు జరపాలా వద్దా అనే అంశంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సస్పెన్స్ మెయింటెన్ చేస్తున్నారు. అమెరికాతో శాంతి ఒప్పందానికి మొగ్గు చూపడం లేదా ఊహించని రీతిలో భారీ స్థాయి సైనిక దాడులను ఎదుర్కోవడం అనే రెండే మార్గాలు ఇరాన్ ముందు ఉన్నాయని ట్రంప్ అన్నారు. ఓవల్ ఆఫీసులో విలేకరులతో ట్రంప్ మాట్లాడారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఇరాన్‌లో భయం కనిపిస్తుందని అన్నారు.

Also Read : భూమికి దూరమవుతున్న చందమామ… ఖగోళంలో నిశ్శబ్ద పరిణామం’లూనార్ రిసెషన్’

గత రెండు వారాలుగా అమెరికా జరిపిన భీకర దాడుల కారణంగా ఇరు దేశాల మధ్య ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా విచ్ఛిన్నమైంది. ప్రపంచ వ్యాపారానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయకుండా నిరోధించడానికే తాము ఈ తీవ్రమైన దాడులు నిర్వహిస్తున్నామని అమెరికా సమర్థించుకుంది. అయితే దీనికి ప్రతిచర్యగా ఇరాన్ జరిపిన ప్రతీకార దాడుల్లో నలుగురు అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కేవలం నాలుగైదు వారాల్లో ముగుస్తుందని అంచనా వేసిన ఈ యుద్ధం ప్రస్తుతం ఐదో నెలకు చేరుకోవడంతో, రాబోయే మధ్యంతర ఎన్నికల ముందు ఇది రిపబ్లికన్ పార్టీకి రాజకీయంగా పెద్ద ముప్పుగా మారింది. మరోవైపు ఇరాన్‌కు ఎలాంటి ఆయుధాలు సరఫరా చేయడం లేదని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనకు వ్యక్తిగతంగా హామీ ఇచ్చారని, వారి మాటలను తాను ప్రస్తుతానికి నమ్ముతున్నానని ట్రంప్ తెలిపారు.

Also Read : పుతిన్‌కు ఇంకా చావు లేదా? తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు!