
పాక్ ఆక్రమిత కశ్మీర్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. తమ ప్రాథమిక హక్కులు, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కిన ఆందోళనకారులపై పాకిస్తాన్ ఆర్మీ విరుచుకుపడింది. సైన్యం జరిపిన విచక్షణారహిత తుపాకీ కాల్పుల్లో ఏడుగురు మహిళలతో సహా ఏకంగా 19 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
Also Read : చందమామను ఢీకొట్టబోతున్న రాకెట్ శకలం.. ఈ భారీ విధ్వంసంతో మనుషులకేమైనా ప్రమాదమా?
అయితే పీవోకే వ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే జల విద్యుత్‌ను పాకిస్తాన్ ప్రభుత్వం తన ప్రధాన నగరాలకు తరలించుకుపోతోంది. కానీ.. స్థానికంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్న పీవోకే ప్రజలకు మాత్రం ప్రభుత్వం ఊహించని రీతిలో భారీగా కరెంట్ బిల్లులు పంపుతోంది. తమ ప్రాంతపు సహజ వనరులను దోచుకుంటూ.. తమపైనే మోయలేని ఆర్థిక భారం మోపడంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టారు.
సరిగ్గా పీవోకే స్థానిక చట్టసభకు మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈ ఆందోళనలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఈ నిరసనలను అణచివేసేందుకు పాక్ ప్రభుత్వం ఆర్మీ బలగాలను రంగంలోకి దించగా.. సైన్యం నేరుగా నిరసనకారులపై కాల్పులకు తెగబడటంతో పీవోకే వ్యాప్తంగా భయాందోళనలు మొదలయ్యాయి.
Also Read : అమెరికా-సౌదీల బిగ్ డీల్.. తెరవెనుక ఇజ్రాయెల్ మైండ్ గేమ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!









