
Russia Ukraine War : రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య కొనసాగుతున్న యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. శుక్రవారం రాత్రి ఉక్రెయిన్ రాజధాని కీవ్ ప్రాంతంపై రష్యా బలగాలు డ్రోన్‌ల దాడిని తీవ్రతరం చేశాయి. ఈ ఒక్క రాత్రిలోనే రష్యా ఉక్రెయిన్ రాజధాని కివ్‌పై ఏకంగా164 డ్రోన్‌లు ప్రయోగించినట్టు ఆ దేశ వైమానిక దళం ప్రకటించింది. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలపింది. రష్యా దాడుల్లో 12కు పైగా అపార్ట్‌మెంట్లు, గోదాములు ఇతర నిర్మాణాలు ధ్వంసమయ్యాయని సైనిక అధికారులు తెలిపారు. రష్యా గురువారం ప్రారంభించిన డ్రోన్ల దాడులు శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత కూడా కొనసాగినట్లు ఆ డ్రోన్ల దాడులు కీవ్ నగరాన్ని 15 గంటలపాటు కమ్మేశాయని విదేశాంగ వ్యవహారాల శాఖ తెలిపింది.
Also Read : రంగు మారుతున్న నీరు.. నేపాల్ కు ముంచుకొస్తున్న మరో ముప్పు?
కాగా రష్యా చేసిన ఈ దాడి పౌరజీవనాన్ని స్తంభింపజేయడంతో పాటు ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. రానున్న శీతాకాలంలో ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగేలా రష్యన్‌లు విద్యుత్ గ్రిడ్‌లు లక్ష్యంగా డ్రోన్ దాడులు కొనసాగిస్తున్నారని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. కాగా రష్యా గత రాత్రి జరిపిన గ్లైడ్ బాంబు దాడిలో నల్ల సముద్రానికి సమీపంలోని ఖెర్సోన్ ప్రాంతంలో ఉన్న విద్యుత్ కేంద్రం తీవ్రంగా దెబ్బతింది. దీనితో ఆ కేంద్రం మూసివేతకు దారితీసింది. రష్యన్ దాడుల మూలంగా ఉక్రెయిన్ ఆర్థికంగా తీవ్రంగా చితికిపోతోందని… ఈ సంవత్సరం స్థూల జాతీయోత్పత్తి వృద్ధి పడిపోయిందని ఉక్రెయిన్ ఆర్థిక శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.
Also Read : భారత్ ను తాకిన నేపాల్ వరదలు… 200 కి.మీ కొట్టుకొచ్చిన మృతదేహాలు









