
Strait of Hormuz : అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో హర్మూజ్ జలసంధి వివాదస్పదమైన విషయం తెలిసిందే. హర్మూజ్ జలసంధి పై పట్టు బిగించేందుకు అమెరికా ప్రయత్నిస్తుండగా, ఆ జలసంధి తమ ఆధీనంలో ఉన్నంతవరకు తమను ఎవరు ఏం చేయలేరన్న ధీమాలో ఉంది ఇరాన్. కాగా, ఉద్రిక్తతలు మొదలైన సందర్భంలోనే ఇరాన్ హర్మూజ్ జలసంధిలో పెద్ద ఎత్తున సీమైన్స్(సముద్ర బాంబులు) అమర్చినట్లు ప్రకటించింది. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తొలిదశలోనే హర్మూజ్ ను తన ఆధీనంలోకి తెచ్చుకున్న ఇరాన్ .. దానిలోని అంతర్జాతీయ నౌకా మార్గాల్లో సీమైన్స్‌ను పెద్ద ఎత్తున పరిచింది. దాంతో ఇరాన్ చెప్పిన మార్గంలో కాకుండా ఇతర మార్గాల్లో వెళ్లిన పలు నౌకలు వాటిని ఢీకొని పేలిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే ఇతర దేశాల నౌకలు వ్యాపార నిమిత్తం ఆ ప్రాంతం గుండా వెళ్లడానికి వెనుకడుగు వేశాయి.
Also Read : నేపాల్‌లో తొలగని వరద ముప్పు.. మళ్లీ పెను ప్రమాదం పొంచి ఉందా?
ఈ సమయంలో అమెరికా అత్యంత ప్రకటన చేసింది. హర్మూజ్ జలసంధి తమ ఆధీనంలోనే ఉందని నిరూపించుకునేందుకు ఇది కీలక ప్రకటనగా చెప్పుకోవచ్చు. హర్మూజ్‌లో నౌకాయానానికి ఆటంకం కలిగిస్తోన్న ఆ సీమైన్స్ ను పూర్తిగా తొలగించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. గత కొంత కాలంగా అంత్యంత రహస్యంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు పేర్కొంది.
నిజానికి ఈ సీమైన్స్ తొలగింపు ఆపరేషన్ అత్యంత క్లిష్టమైనదే కాకుండా ప్రమాదకరమైంది. విశాల సముద్రంలో ఇరాన్ ఎక్కడెక్కడ సీమైన్స్ అమర్చిందో ఆ దేశానికి కూడా గుర్తుందా లేదా అనేది తెలియదు. అలాంటి విశాల సముద్రంలో సీమైన్స్ వెతకడం అంటే సముద్రంలో ఆవగింజ కోసం వెతికినట్లు ఉంటుందనేది వాస్తవం. కానీ, ప్రపంచ దేశాలకు నమ్మకం కలిగించడం కోసం చాలా కాలంగా ట్రంప్ వీటిని తొలగిస్తామని బలంగా చెబుతూ వస్తున్నాడు. కొన్ని నెలల క్రితం వీటిని తొలగించేందుకు అమెరికా రెండు గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లు యూఎస్‌ఎస్ ఫ్రాంక్ ఇ పీటర్సన్, యూఎస్‌ఎస్ మైఖేల్ మర్ఫీని రంగంలోకి దింపినట్లు ప్రకటించింది. వీటికి అండగా ఎంకే 18, మాడ్ 2 కింగ్‌ఫిష్ మానవ రహిత పరికరాలు కూడా వినియోగించింది. అయితే సీమైన్స్‌లో అనేక రకాలుంటాయి. సముద్ర జలాల్లో నౌకలు కదిలినప్పుడు ఏర్పడే పీడనం, తరంగాల శబ్దం, నౌకల విద్యుత్తు శక్తి ఆధారంగా పనిచేసే మైన్స్ కూడా ఉంటాయి. వీటిల్లో కొన్నింటిని లేజర్ లేదా రాడార్ల సాయంతోనూ గుర్తించే అవకాశం లేదు. ఒకవేళ గుర్తించినా వాటిని నిర్విర్యం చేయడం కష్టతరం. అలాంటి సంక్లిష్టమైన ఆపరేషన్‌ను అమెరికా పూర్తి చేశానని ప్రకటించడం నిజంగా ప్రపంచానికి పెద్ద ఊరటగానే చెప్పుకోవచ్చు.
Also Read : నేపాల్‌కు మళ్లీ వరద ముప్పు.. చైనా నుంచి అత్యవసర హెచ్చరిక.. మరో మూడు రోజుల్లో ప్రళయమే?









