
Earthquake: జపాన్ లో భారీ భూకంపం సంభవివించింది. క్యుషు ద్వీపంలో ఉన్న కుమమొటో ప్రిఫెక్చర్‌ను భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదైందని జపాన్ వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్ర గర్భంలో 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ భారీ భూకంపం కారణంగా అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సముద్ర తీర ప్రాంతాల్లో గరిష్టంగా ఒక మీటరు తఎత్తున అలలు ఎగిసిపడే అవకాశం ఉందని హెచ్చరించారు. తీర ప్రాంత ప్రజలు వెంటనే సురక్షితమైన ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని, ప్రభుత్వ అధికారిక మార్గదర్శకాలను పాటించాలని కోరారు.
ఈ విపత్తుపై జపాన్ ప్రధానమంత్రి కార్యాలయం స్పందించింది. నష్టానికి సంబంధించి పరిస్థితిని వీలైనంత త్వరగా అంచనా వేయాలని అధికారులను ఆదేశించింది. ప్రజల ప్రాణాల రక్షణకే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అత్యవసర సహాయక చర్యల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పనిచేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Also Read : ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా-ఇజ్రాయెల్ మధ్య లొల్లి.. నెతన్యాహుకి ట్రంప్ స్ట్రాంగ్ కౌంటర్
జపాన్ దక్షిణ ప్రాంతమైన క్యుషు ద్వీపంలోని కుమమొటో, నాగసాకి, కగోషిమా, ఫుకుయోకా, సాగా, ఓయిటా, ప్రిఫెక్చర్‌ల ప్రజలను అప్రమత్తం చేస్తూ జపాన్ ప్రభుత్వం అత్యవసర భూకంప హెచ్చరికలను జారీ చేసింది, జపాన్ లో భూకంపం సంభవించడం వారంలో ఇది రెండోసారి. జూలై 25వ తేదీన 7.2 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. అయితే అప్పుడు ఎలాంటి ప్రాణనష్టం గానీ, పెద్దగా ఆస్తి నష్టం గానీ జరగలేదు.
కాగా అందుకే ప్రపంచంలో అత్యధికంగా భూకంపాలు సంభవించే దేశాలలో ఇది ఒకటి.దాదాపు 12.5 కోట్ల జనాభా కలిగిన ఈ ద్వీప దేశంలో ప్రతి సంవత్సరం వందలాది ప్రకంపనలు సంభవిస్తుంటాయి. ప్రపంచంలో జరిగే మొత్తం భూకంపాలలో సుమారు 18 శాతం జపాన్‌లోనే నమోదవుతుంటాయి. వాటిలో అత్యధిక భూకంపాలు చాలా తక్కువ తీవ్రతతోనే ఉంటాయి. అయితే, అవి సంభవించిన ప్రదేశం మరియు భూమి లోపల వాటి లోతును బట్టి నష్టం ఎంతనేది మారుతుంటుంది.
2011లో సంభవించిన భారీ 9.0 తీవ్రత భూకంపం తాలూకు చేదు జ్ఞాపకాలు ఇక్కడి ప్రజలను ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. ఆ సమయంలో వచ్చిన సునామీ దాటికి సుమారు 18,500 మంది ప్రాణాలు కోల్పోవడం లేదా గల్లంతు కావడం జరిగింది. అంతేకాకుండా, ఫుకుషిమా అణుకేంద్రం కూడా దెబ్బతింది.
ఈ ఏడాది ఏప్రిల్ 20వ తేదీన కూడా దేశ ఉత్తర ప్రాంతంలో 7.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీనివల్ల కనీసం 10 మంది గాయపడ్డారు మరియు టోక్యో నగరంలోని పెద్ద భవనాలు కూడా వణికిపోయాయి. దీంతో 8.0 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందంటూ అధికారులు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేశారు. వారం రోజుల తర్వాత ఆ హెచ్చరికలను ఎత్తివేశారు.
Also Read : కాస్పియన్ సముద్రంలో ఉక్రెయిన్ దాడి.. ఇరాన్ సీరియస్ వార్నింగ్









