Balochistan: పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ విడిపోయి స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఆగస్టు 11వ తేదీని బలూచిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోవాలని అధికారికంగా తెలిపింది. పాకిస్తాన్ ఆధిపత్యాన్ని తిరస్కరిస్తూ బలూచిస్తాన్ ఒక స్వతంత్ర దేశంగా అంతర్జాతీయ సమాజం తక్షణమే గుర్తించాలని డిమాండ్ చేశారు.

Also Read : అమెరికాలో టారిఫ్ వార్.. ట్రంప్‌పై తిరుగుబాటెత్తిన 25 రాష్ట్రాలు!

బలూచ్ నాయకుడు మీర్ యార్ బలూచ్, బలూచిస్థాన్ రిపబ్లిక్ ప్రతినిధులు తాజాగా ఓ ప్రకటన ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. స్వతంత్ర బలూచిస్థాన్ జెండాను ఇళ్లపైనా, వ్యాపార సముదాయాలు, పాఠశాలలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఎగురవేయాలని స్థానిక ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బలూచ్ వర్గాలకు పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు తమ పోరాట చరిత్రను, ఆగస్టు 11వ తేదీ ప్రాముఖ్యతను అందించడమే దీని ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

ఇకపై ఏటా ఆగస్టు 11నే తమ జాతీయ దినోత్సవంగా పాటిస్తామని స్పష్టం చేశారు. అయితే దీని వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. 1947లో బ్రిటీష్ పాలకులు భారత ఉపఖండం నుంచి వెళ్లిపోతున్న సమయంలో పాకిస్థాన్ కంటే ముందే అంటే ఆగస్టు 11న బలూచిస్థాన్ తన స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుందట. కానీ 1948 మార్చిలో పాకిస్థాన్ సైన్యాన్ని పంపి బలవంతంగా బలూచిస్థాన్‌ను ఆక్రమించుకుని అప్పటి నుంచి అణచి వేస్తుందని బలూచ్ తెలిపింది.

పాకిస్థాన్ అనుసరిస్తున్న తీరుపై బలూచ్ ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 1947 నాటి భారత విభజన దక్షిణ ఆసియా మొత్తాన్ని అస్థిర పరిచిందని మండిపడ్డారు. కశ్మీర్ వివాదం, 1971 బంగ్లాదేశ్ ఆవిర్భావ యుద్ధం, చాగైలో అణుపరీక్షలు, ఉగ్రవాద మూలాలు వంటివన్నీ పాకిస్థాన్ విధ్వంసకర విధానాలకు నిదర్శనమని ఆరోపించారు. పాకిస్థాన్ చర్యల వల్లే ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా రక్తపాతం, ఆర్థిక సంక్షోభం నెలకుందని మండిపడ్డారు.

ప్రపంచంలో శాంతి, స్థిరత్వం నెలకొనాలంటే బలూచిస్థాన్‌ను ఒక స్వతంత్ర దేశంగా గుర్తించడం తప్ప వేరే మార్గం లేదని బలూచిస్థాన్ రిపబ్లిక్ పేర్కొంది. సుమారు 6 కోట్ల మంది బలూచ్ ప్రజల ఆకాంక్షలను గౌరవించి, ఐక్యరాజ్యసమితితో పాటు వివిధ దేశాల ప్రభుత్వాలు తమను సార్వభౌమ దేశంగా ఆమోదించాలని అభ్యర్థించింది.

Also Read : 5.4 తీవ్రతతో ఈజిప్ట్‌లో భూకంపం