Pezeshkian : అమెరికా, ఇరాన్‌ల మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒకవైపు పశ్చిమాసియా ఘర్షణలు తారాస్థాయికి చేరిన వేళ ఇరాన్ అధ్యక్షుడు అమెరికా లో పర్యటించనుండటం సంచలనంగా మారింది. యుద్ధం వేళ ఆ దేశ అధ్యక్షుడు పెజెష్కియాన్, ఇతర కీలక నేతలు అమెరికాలో పర్యటించడానికి సిద్ధపడ్డారు. దీనికి సంబంధించి ఆ నేతల వీసాలకు అమెరికా ఆమోదం కూడా తెలిపింది. ఈ విషయాన్ని యూఎస్ విదేశాంగశాఖ ఇప్పటికే ధ్రువీకరించింది.

Also Read : ఫిజీలో HIV ఎమర్జెన్సీ.. 60 మందిలో ఒకరికి వైరస్!

అయితే ఇరాన్‌ నేతల అమెరికా పర్యటనకు కారణం లేకపోలేదు. వచ్చేవారం న్యూయార్క్‌ నగరంలో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ ఉన్నతస్థాయి సమావేశంలో ఐరాస లో సభ్యదేశాలన్నీ పాల్గొననున్నాయి. అందులో భాగంగానే ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ సహా ఇతర బృందం కూడా సమావేశానికి హాజరు కానున్నారు. దీనికి గాను అమెరికా అనుమతులు కూడా ఇచ్చింది. ‘‘ఒక ఆతిథ్యదేశంగా మాకున్న బాధ్యతలకు అనుగుణంగా.. ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి బృందం సమావేశాల్లో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చాం’’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. అయితే గతేడాదితో పోలిస్తే సమావేశంలో పాల్గొనే ఇరాన్‌ ప్రతినిధుల సంఖ్య తక్కువగా ఉంటుందని చెప్పారు. వారిపై ప్రయాణ ఆంక్షలు ఉంటాయని, విలాస వస్తువులు, ఇతర వుస్తువుల కొనుగోలుపై నిషేధం ఉంటుందని అధికారులు వెల్లడించారు.

ఇదిలా ఉండగా ఇరాన్‌తో మంచి ఒప్పందం కుదిరితేనే యుద్ధం ముగుస్తుందని, లేదంటే ఎలాంటి డీల్ ఉండబోదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వేళ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాల అధినేతలతో జరగబోయే కీలక భేటీకి ముందు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా అంచనాలకు తగ్గట్టుగా ఉంటేనే ఇరాన్‌తో ఏవైనా ఒప్పందాలుంటాయని, లేదంటే ఎలాంటి చర్చలకూ తావులేదని ట్రంప్‌ తేల్చిచెప్పారు. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఇరాన్‌తో ఒప్పందం అంశంపై ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

అంతేకాదు అమెరికాతో ఒప్పందాన్ని ఇరాన్ కోరుకుంటోందని ట్రంప్ తెలిపారు. కానీ, తమతో ఒప్పందానికి ఇరాన్ ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికా అంచనాలు, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే ఎలాంటి ఒప్పందానికైనా తాము అంగీకరిస్తామని తేల్సి చెప్పారు. యుద్ధాన్ని ముగించే దిశగా అమెరికా అడుగులు వేస్తోందన్నారు. ఒప్పందం అంశంపై ఇరాన్ నుంచి నేరుగా తమకు సంకేతాలు అందాయని ట్రంప్ ఇదివరకే చెప్పిన విషయం తెలిసిందే.

Also Read : అమెరికా నుంచి ఇజ్రాయెల్‌కు భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల భారీ బాంబుల సరఫరా..

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.