donald Trump

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై ఒక కొత్త సర్వే వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నో యుద్ధాలను ఆపానని, శాంతి స్థాపించానని చెప్పుకుంటూ నోబెల్ శాంతి బహుమతి కూడా అడిగిన ట్రంప్.. వైట్‌హౌస్‌లోకి రెండోసారి అడుగుపెట్టిన తర్వాత ఆయన ఆదరణ ఇప్పుడు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది.

Also Read : టోక్యో వద్దు.. రాజధాని మార్చుకుంటున్న జపాన్.. ఎందుకో తెలుసా?

ఇకోనామిస్ట్, యుగవ్‌ సంస్థలు కలిసి ఒక కొత్త సర్వే రిపోర్ట్ విడుదల చేశాయి. ఈ సర్వే ప్రకారం.. అమెరికాలో కేవలం 34 శాతం మంది ప్రజలు మాత్రమే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనితీరు బాగుందని నమ్ముతున్నారు. అయితే, 62 శాతం మంది అమెరికన్లు మాత్రం ట్రంప్ చేస్తున్న పనులపై అసంతృప్తితో ఉన్నారు. ఈ లెక్కలు పోయిన వారంతో పోలిస్తే రెండు శాతం ఎక్కువే అయినా, ఆయన పాపులారిటీ మాత్రం చాలా తక్కువగా ఉంది.

ఈ సర్వే ఫలితాలపై వైట్‌హౌస్ ప్రతినిధి డేవిస్ ఇంగిల్ స్పందించారు. ఆయన ఈ సర్వే లెక్కలను పూర్తిగా కొట్టిపారేశారు. నవంబర్ 5, 2024 నాడు దాదాపు 8 కోట్ల మంది అమెరికన్లు భారీ మద్దతుతో డొనాల్డ్ ట్రంప్‌ను ఎన్నుకున్నప్పుడే అసలైన మద్దతు ఏంటో తేలిపోయిందని ఆయన తెలిపారు. అమెరికాలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అధ్యక్షుడు చారిత్రాత్మకమైన అభివృద్ధి సాధించారని, ఇది కేవలం మొదలు మాత్రమే అని ఆయన చెప్పారు. ట్రంప్ తెచ్చిన ప్రణాళికలు అమలులోకి వస్తున్న కొద్దీ భవిష్యత్తులో మరిన్ని మంచి ఫలితాలు కనిపిస్తాయని ఆయన పేర్కొన్నారు.

Also Read : మళ్లీ భగ్గుమన్న పశ్చిమాసియా: తీవ్రమవుతున్న యుద్ధ మేఘాలు

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.