donald Trump

Donald Trump :  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భద్రతకు సంబంధించి ఒక షాకింగ్ నిజం బయటపడింది. గత నెలలో టర్కీ నుంచి తిరిగి వస్తున్నప్పుడు ట్రంప్‌ను చంపేస్తామని ఇరాన్ నుంచి బెదిరింపులు వచ్చాయట. ఈ విషయాన్ని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక వెల్లడించింది. ఈ బెదిరింపు ఎంత డేంజర్‌గా ఉందంటే, ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్ పెద్ద విమానం ఎక్కిన తర్వాత, ఆయనను ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఒక చిన్న సైనిక విమానంలోకి మార్చారు. అసలు విషయం ఏంటంటే, ట్రంప్ ఇంకా పెద్ద విమానంలోనే ఉన్నారనే అందరినీ, మీడియాను కూడా నమ్మించారు.

నాటో మీటింగ్‌కు వెళ్లిన డొనాల్డ్ ట్రంప్ జూలై 8వ తేదీన అంకారా ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కారు. అయితే ఎక్కిన కొద్దిసేపటికే, ఆయన్ని ఒక క్యాటరింగ్ బాక్స్ ద్వారా చాలా గోప్యంగా వేరే చోటుకి మార్చారట. ఆ తర్వాత ట్రంప్‌ను ఒక చిన్న C-32A ఆర్మీ ప్లేన్‌లోకి మార్చి బ్రిటన్‌కు తీసుకెళ్లారు. ఈ తతంగం అంతా జరుగుతున్నప్పుడు.. అధ్యక్షుడు ఇంకా ఆ పెద్ద ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలోనే కూర్చున్నారని మీడియా వాళ్లతో సహా చాలా మంది అధికారులు కూడా నమ్మి మోసపోయారు.

Also Read : ట్రంప్‌కు బిగ్ షాక్.. ఆయుధాలు ఖతం!

అమెరికా ప్రభుత్వం ఈ సీక్రెట్ ఆపరేషన్ గురించి బయటకు చెప్పలేదు కానీ.. ఇరాన్‌కు సంబంధించిన గ్రూపుల నుంచి ప్రమాదం ఉందని సమాచారం అందడం వల్లే ట్రంప్ ప్రయాణం ప్లాన్‌ను చివరి నిమిషంలో మార్చేశారని తెలుస్తోంది. ఆ సమయంలో అంకారా నుంచి బయలుదేరే విమానంలో ఉన్న జర్నలిస్టులకు విండో కర్టెన్లు మూసేయాలని గట్టిగా చెప్పారు. సాధారణంగా ఎక్కడైనా యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు లేదా పెద్ద ప్రమాదం పొంచి ఉన్నప్పుడే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు.

ఇక అసలు విషయం ఏమిటంటే.. ట్రంప్ టర్కీకి వెళ్లడానికి వాడిన కొత్త బోయింగ్ 747-8 విమానాన్ని ఖతార్ రాజకుటుంబం అమెరికాకు గిఫ్ట్‌గా ఇచ్చింది. అయితే ఈ కొత్త విమానం భద్రత మీద సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్స్ మొదట్నుంచీ కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాత ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ఉన్నట్టుగా ఈ కొత్త విమానంలో మిస్సైల్స్ అడ్డుకునే ఆధునిక రక్షణ వ్యవస్థలు లేవని చెబుతున్నారు. అందుకే తిరుగు ప్రయాణంలో భద్రతా అధికారులు ఇంత రిస్క్ తీసుకుని మరీ ఈ అడుగులు వేశారని భావిస్తున్నారు.

Also Read : జిన్నా చేసిన నమ్మకద్రోహం.. బలూచిస్తాన్‌ను బలితీసుకున్న పాకిస్తాన్!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.