
అమెరికా వలస వెళ్లాలనుకునే వారికి ట్రంప్ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో ఇమిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దేశంలోకి అక్రమ, భారాన్ని పెంచే వలసలను అరికట్టడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అమెరికా ప్రభుత్వం ‘పబ్లిక్ ఛార్జ్’ నిబంధనలను మరింత కఠినతరం చేస్తోంది. విదేశాల నుంచి వచ్చే వలసదారులు అమెరికా వచ్చాక తమ సొంత డబ్బుతో బతకగలరా? లేక అక్కడి ప్రభుత్వ పథకాలు, ఉచిత సాయంపై ఆధారపడతారా? అనేది పరీక్షించడానికి అమెరికా తన కాన్సులర్ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. అధికారులకు ఈ ట్రైనింగ్ ఇవ్వడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. మున్ముందు ప్రభుత్వ సాయంపై ఆధారపడే అవకాశం ఉన్నవారికి వీసాలు ఇవ్వకుండా తిరస్కరించడమే.
ఈ శిక్షణా ప్రక్రియ కొనసాగుతున్నందున ఇప్పటికే షెడ్యూల్ అయిన ఇంటర్వ్యూలను రద్దు చేసి త్వరలోనే కొత్త తేదీలను రీషెడ్యూల్ చేస్తామని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండే నైపుణ్యం ఉన్న విదేశీ ఉద్యోగులకు ఇచ్చే H-1B వీసాలపై ఏకంగా 1,03,265 డాలర్లు (రూ. 85 లక్షలకు పైగా) అదనపు రుసుము వేయాలని ట్రంప్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే ఈ నిర్ణయం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకే పెద్ద దెబ్బ పడుతుందని సమాచారం. ఇంత పెద్ద మొత్తంలో ఫీజులు పెంచితే అమెరికా కంపెనీలు మంచి జీతాలు ఇచ్చే పెద్ద ఉద్యోగాలను భారత్ వంటి ఇతర దేశాలకు తరలించే అవకాశం ఉంది. దీనివల్ల ప్రపంచంలోనే ప్రతిభ ఉన్నవారిని తమ దేశానికి రప్పించడంలో అమెరికా వెనుకబడిపోతుందని స్పష్టం చేశారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ కఠిన నిబంధనల వల్ల భారత్‌తో సహా అనేక దేశాల విద్యార్థులు, ప్రజలు అయోమయంలో పడ్డారు. వీసా ఇంటర్వ్యూలు ఎప్పుడు ఉంటాయో తెలుసుకోవడానికి దరఖాస్తుదారులు తమ ఇమెయిల్స్, అధికారిక సమాచారాన్ని తరచూ చూసుకోవాల్సి ఉంటుంది.
Also Read : ఇది చైనా చేసిన ఉద్ధేశపూర్వక పర్యావరణ విపత్తు.. నేపాల్ జర్నలిస్టుల ఎక్స్ హ్యాండిల్ సంచలన ఆరోపణ









