
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతలతో రగిలిపోతున్న మిడిల్ ఈస్ట్‌లో అమెరికా వేగంగా తన సైనిక బలగాలను పెంచుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. ఆ ప్రాంతానికి కొత్తగా మరో 10 వేల మంది అమెరికన్ సైనికులను రప్పించడంతో పాటు భయంకరమైన యుద్ధ నౌకలను మోహరిస్తోంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అసలు అమెరికా ప్లాన్ ఏంటో అర్థం కాక ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి.
ఈ మిలిటరీ ఆపరేషన్‌లో భాగంగా యూఎస్ఎస్ థియోడోర్ రూజ్వెల్ట్ అనే భారీ విమానవాహక నౌకను పశ్చిమాసియా వైపు తరలిస్తోంది. ఇది సాదాసీదా నౌక కాదు.. గాల్లోంచే శత్రువుల స్థావరాలను ధ్వంసం చేయగల సామర్థ్యం ఉన్న యుద్ధ విమానాలు దీనిపై ఉంటాయి. ఇప్పటికే పశ్చిమాసియా తీరంలో యూఎస్ఎస్ జార్జి హెచ్‌డబ్ల్యూ బుష్, యూఎస్ఎస్ జార్జి వాషింగ్టన్ అనే రెండు బలమైన విమానవాహక నౌకలు అమెరికా తరఫున మోహరించి ఉన్నాయి. ఇప్పుడు ఈ మూడో విమానవాహక నౌక కూడా వచ్చి చేరడంతో అక్కడ అమెరికా సైనిక శక్తి మునుపెన్నడూ లేనంత స్థాయికి చేరింది.
Also Read : ఇండియాకు బిగ్ షాక్స్… పెరిగిన క్రూడ్ అయిల్ ధర..తగ్గిన రూపాయి విలువ?
కేవలం విమానవాహక నౌకలు మాత్రమే కాకుండా అడ్వాన్స్డ్ వార్షిప్లతో కూడిన ఒక భారీ స్ట్రైక్ గ్రూప్ కూడా అక్కడ ల్యాండ్ కాబోతోంది. దీనికి అదనంగా మరో 10,000 మంది సైనికులు అక్కడికి చేరుకుంటుండటంతో పశ్చిమాసియా దాదాపు ఒక యుద్ధ క్షేత్రంగా మారిపోయింది. మూడు భారీ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు, పదుల సంఖ్యలో యుద్ధ నౌకలు, వేలాది మంది సైనికులు ఒకే ప్రాంతంలో తిష్ట వేయడం వెనుక చాలా పెద్ద వ్యూహమే ఉందనే ప్రచారం జరుగుతోంది.
ఈ సడన్ డెవలప్మెంట్కు ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలేనని స్పష్టమవుతోంది. నవంబరు 3న అమెరికాలో జరగనున్న కీలక ఎన్నికలు ముగిసిన వెంటనే ఇరాన్‌పై భారీ స్థాయిలో కొత్త దాడులకు దిగుతామని ట్రంప్ ఇప్పటికే ఓపెన్‌గా వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల వేడి ఒకవైపు ఉంటే ఇరాన్‌ను కోలుకోలేని దెబ్బ తీయడానికి ట్రంప్ ఇప్పటినుంచే సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇరాన్ చుట్టూ ముట్టడి బిగించి ఏ క్షణంలోనైనా విరుచుకుపడేలా అమెరికా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఒకవేళ నవంబర్ ఎన్నికల తర్వాత ఇరాన్‌పై అమెరికా గనుక నేరుగా దాడికి దిగితే అది కేవలం ఆ రెండు దేశాలకే పరిమితం కాకుండా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసినా ఆశ్చర్యం లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాలు గ్లోబల్ మార్కెట్లో చమురు సరఫరాపై అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Also Read : ‘అవును, ఇన్స్టాగ్రాం ఉన్నది గర్ల్స్ కోసమే’ ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు









