Pattaya-US Sailors : పశ్చిమాసియాలో ఇరాన్‌, అమెరికా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో గత 250 రోజులకు పైగా సముద్ర జలాల్లో గడపిన అమెరికా సైనికులకు విశ్రాంతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో వారు పశ్చిమాసియా జలాల నుంచి థాయ్‌లాండ్‌కు చేరుకున్నారు. ఇన్నా్ళ్లు వారు విధులు నిర్వహిస్తున్న అమెరికా విమాన వాహకనౌక యూఎస్‌ఎస్ అబ్రహాం లింకన్‌ థాయ్‌ల్యాండ్‌కు చేరుకుంటుందనన్న వార్తతో థాయ్‌ పోలీసులు అలర్ట్‌ అయ్యారు. అమెరికా సైనికులు థాయ్‌ లోని పట్టాయా రేవుకు చేరుకుంటారని తెలిసిన వెంటనే అక్కడి పోలీసులు స్థానికంగా వ్యభిచార కార్యకలపాలు పెరిగే అవకాశం ఉందన్న అనుమానంతో పలువురు సెక్స్‌ వర్కర్లను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే అక్కడి అధికారులు ఊహించిన దానికి భిన్నంగా అమెరికా సైనికుల ప్రవర్తన ఉండటంతో అంతా అవాక్కయ్యారు.

Also Read : మిడ్‌టర్మ్ ఎన్నికల్లో ట్రంప్‌కు బిగ్‌ షాక్‌.. డెమోక్రటిక్ పార్టీకి జై కొట్టనున్న ఓటర్లు

కాగా సెప్టెంబర్ 2న యూఎస్‌ఎస్ అబ్రహాం లింకన్‌, ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌, రెండు యుద్ధ నౌకలకు చెందిన నావికులు, పైలట్లు, మెరైనర్లు థాయ్‌లోని పట్టాయా నగరానికి చేరుకున్న విషయం తెలిసిందే. సుమారు నాలుగు రోజుల పాటు అక్కడే గడిపిన సైనికులు షాపింగ్‌ చేయడానికి ఆసక్తి చూపడం గమనార్హం. రాజధాని నగరం బ్యాంకాక్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టాయా నగరం నైట్‌లైఫ్, బీచ్‌లకు ఫేమస్‌. సముద్ర విధుల్లో నెలల తరబడి గడిపిన సైనికులు ఇక్కడ కొంత సమయం విశ్రాంతిగా గడిపారు. అనంతరం అక్కడ షాపింగ్ చేయడం విశేషం. షాపింగ్‌ సందర్భంగా వారు ఎక్కువగా సాక్సుల వంటివాటిని కొనుగోలు చేశారని మీడియా వెల్లడించింది. ఇంకా థాయ్ ఆహారం తినడంతో పాటు బార్లలో ఎక్కువ సమయం గడిపారని మీడియా కథనాలు వెల్లడించాయి. అలాగే వారిలో వారు చిన్నచిన్న గొడవలు మినహా ఈసారి వచ్చిన సిబ్బంది అందరితో ఎంతో మర్యాదగా వ్యవహరించారని మీడియా వెల్లడించింది.

సైనికులు ఎక్కువగా ఆహారం, దుస్తులు, షూలు, బహుమతులపై దృష్టిపెట్టడంతో నైక్‌, విక్టోరియాస్ సీక్రెట్‌, స్టార్‌బక్స్‌ వంటి సంస్థల వ్యాపార కార్యకలాపాలు ఘననీయంగా పెరిగినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే.. ఒకప్పుడు పట్టాయా ప్రాంతం మత్స్యకారుల గ్రామంగా ఉండేది.. ఇప్పుడు వినోద కేంద్రంగా రూపొందింది. అందుకు వియత్నాం యుద్ధమే కారణమంటారు. నాడు థాయ్‌లాండ్‌లో మోహరించిన అమెరికా సైనికులు.. విశ్రాంతి, వినోదం కోసం పట్టాయాకు వచ్చేవారు. దానివల్ల అక్కడ వ్యాపారం వృద్ధి చెందింది. కాలక్రమంలో అదొక పర్యాటక కేంద్రంగా రూపాంతరం చెందింది. కాలక్రమంలో పట్టాయా గ్రామం అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పర్యాటక, వినోద కేంద్రంగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం బీచ్‌లు, నైట్‌లైఫ్‌, షాపింగ్‌ వంటి వాటికి ఈ నగరం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందని స్థానికులు చెబుతున్నారు.

Also Read : ఇది చూశారా.. ట్రంప్ కొత్త లుక్ : సోషల్ మీడియాలో రచ్చ రచ్చ!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.