Chef Of Staff : మధ్యంతర ఎన్నికల ఫలితాల తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో భారీ మార్పులు చేశారు. వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఉన్న సూసీ వైల్స్ స్థానంలో తన సన్నిహితుడు స్టీఫెన్ మిల్లర్‌ను ట్రంప్ నియమించారు. నవంబర్ 9న మిల్లర్ అధికారికంగా ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నియామకం ద్వారా తన “అమెరికా ఫస్ట్” అజెండాను మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లాలని ట్రంప్ ప్లాన్ చేస్తున్నారు.

Also Read : ట్రంప్‌ను ఓడించిన ఇండియన్స్.. ఎందుకంటే?

రాజీనామా చేసిన సూసీ వైల్స్

ట్రంప్ పరిపాలనలో వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేసిన తొలి మహిళగా, అత్యధిక కాలం సేవలందించిన వ్యక్తిగా సూసీ వైల్స్ రికార్డు సృష్టించారు. అయితే, గురువారం రాత్రి ఆమె తన రాజీనామాను సమర్పించారు. కొంతకాలంగా హెల్త్ సమస్యలతో బాధపడుతున్న ఆమె, మార్చి 2026లో బ్రెస్ట్ క్యాన్సర్‌కు ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇటీవల క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నప్పటికీ, బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. వైల్స్ పనితీరును ప్రశంసించిన ట్రంప్, భవిష్యత్తులో ఆమె తమ పొలిటికల్ ఆర్గనైజేషన్ బాధ్యతలను చూసుకుంటారని తెలిపారు.

Also Read : White House హై అలర్ట్: ట్రంప్‌ని చంపేందుకు వచ్చిన వ్యక్తి అరెస్ట్!

ఎవరీ స్టీఫెన్ మిల్లర్?

41 ఏళ్ల స్టీఫెన్ మిల్లర్ మొదటి నుంచి ట్రంప్‌కు అత్యంత నమ్మకమైన ఇన్నర్ సర్కిల్ సభ్యుడు. 2016 ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్‌లో స్పీచ్ రైటర్‌గా కెరీర్ ప్రారంభించిన మిల్లర్, ఆ తర్వాత వైట్‌హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ (పాలసీ)గా, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా కీలక పదవులు చేపట్టారు. ముఖ్యంగా ట్రంప్ హయాంలో తీసుకొచ్చిన కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాల వెనుక మిల్లర్ పాత్రే కీలకం. మొదటి టర్మ్‌లో అనేకమంది సీనియర్ అధికారులు విభేదాలతో వైదొలిగినా, 2021 క్యాపిటల్ హింసాకాండ వివాదం సమయంలోనూ మిల్లర్ ట్రంప్‌కు గట్టి మద్దతుదారుగా నిలిచారు.

“స్టీఫెన్ మొదటి నుంచి నాతో ఉన్నారు, రాజకీయాలపై ఆయనకు మంచి పట్టు ఉంది” అని ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ కొనియాడారు. తన నియామకంపై స్పందించిన మిల్లర్, అధ్యక్షుడికి పూర్తి మద్దతుగా నిలుస్తూ అంకితభావంతో పనిచేస్తానని సోషల్ మీడియాలో స్పష్టం చేశారు.