Rahul Gandhi : కృతి సనన్, కంగనా రనౌత్ మధ్య జరిగిన రక్షా బంధన్ యాడ్ వివాదంపై రాహుల్ గాంధీ స్పందించారు. ఒక జ్యువెల్లరీ యాడ్‌లో కృతి సనన్ వేసుకున్న బట్టలపై విమర్శలు రాగా, రాహుల్ ఆమెకు మద్దతుగా నిలిచారు. ఒక అమ్మాయి ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎక్కడికి వెళ్లాలి, ఏం చేయాలి అనేది పూర్తిగా ఆమె ఇష్టమని రాహుల్ గాంధీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు. అమ్మాయిలు వాళ్ళ ఇష్టం ప్రకారం బట్టలు వేసుకుంటే వారిని తప్పుగా మాట్లాడటం ఆపాలని ఆయన చెప్పారు. పూణేలో జరిగిన మీటింగ్‌లో తాను చెప్పిన మాటలనే ఇక్కడ కూడా గుర్తుచేశారు.

ఈ గొడవ ఒక యాడ్ విషయంలో సోషల్ మీడియాలో మొదలైంది. సోమవారం సాయంత్రం, బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ కృతి సనన్ వేసుకున్న బట్టలపై మండిపడ్డారు. అందరికీ ఎన్నో పద్ధతులు ఉన్నప్పుడు, ఇలాంటి బట్టలు వేసుకుని సొంత అన్నకు రాఖీ కట్టడం ఏంటని ఆమె ప్రశ్నించారు. ఈ యాడ్ చూసేందుకు చాలా అసహ్యంగా ఉందని ఆమె అన్నారు.

కంగనా పేరు ఎత్తకుండానే కృతి సనన్ దీనికి సమాధానం చెప్పారు. పండుగలు అంటే మనం వేసుకునే బట్టలు కాదని, మనసులో ఉండే భావాలు, పద్ధతులని ఆమె తెలిపారు. అమ్మాయిలు ఏం వేసుకోవాలో చెప్పడం ఎప్పుడు ఆపుతారు అని ఆమె ప్రశ్నించారు. ఫ్యాషన్ మారుతోంది కానీ, అమ్మాయిల సంస్కృతిని కేవలం బట్టలను బట్టే చూస్తున్నారని ఆమె బాధపడ్డారు. సంస్కృతి మనసులో ఉంటుంది కానీ బట్టల్లో కాదని కృతి సనన్ చెప్పారు. రక్షా బంధన్ అంటే రక్షణ అని, తాను, తన చెల్లెలు ఒకరికొకరు రాఖీ కట్టుకుంటామని, మా పెంపుడు కుక్కలకు కూడా రాఖీ కడతామని ఆమె తెలిపారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.