wife

Chhattisgarh : సమాజంలో మనుషులుగా పుట్టి పశువులకన్నా హీనంగా ప్రవర్తిసున్నారు కొంతమంది. తాజాగా ఈ ఘటన చూస్తే అదే అనిపిస్తుంది. ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో ఒక మహిళపై ఆమె భర్తే నడిరోడ్డుపై జరిపిన అమానుష దాడి దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. భార్య క్యారెక్టర్‌ను అనుమానిస్తూ.. పిల్లల ముందే ఆమె చేతులు, కాళ్లు కట్టేసి, గుండు గీసి, మొహానికి మసి పూసి, కిరాతకంగా కొట్టడమే కాకుండా.. బలవంతంగా మూత్రం తాగించిన ఘోర సంఘటన వెలుగుచూసింది. ఈ గుండెల్ని పిండేసే ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తార అనే మహిళ జితేంద్ర ఘాసియాతో సుమారు 15 సంవత్సరాల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకుంది. వీరికి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, గత కొన్ని ఏళ్లుగా భర్త వేధింపులు, అనుమానం, ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఆమె భర్తకు దూరంగా ఉంటోంది. తన పిల్లలను పోషించుకోవడానికి పనిమనిషిగా వర్క్ చేస్తూ, తనకు కష్టకాలంలో హెల్ప్ చేసిన ఒక పరిచయస్తుడి ఇంట్లో ఆశ్రయం పొందుతోంది. ఈ క్రమంలో జూన్ 14న ఆమె ఎక్కడుందో ట్రాక్ చేసిన భర్త జితేంద్ర, అక్కడికి చేరుకుని ఆమెను బయటకు పిలిచి ఈ దారుణానికి ఒడిగట్టాడు.

రిలేషన్స్ పెట్టుకుందనే నెపంతో

ఆమె వేరే మగాళ్లతో రిలేషన్స్ పెట్టుకుందనే నెపంతో నడిరోడ్డుపైనే ఆమె చేతులు, కాళ్లు తాడుతో కట్టేసి విపరీతంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా తల వెంట్రుకలు కట్ చేసి, గుండు గీసి, మొహానికి ఇంజన్ ఆయిల్ అండ్ మసి పూశాడు. అత్యంత దారుణంగా ఆమెతో మూత్రం తాగించాడని, నిన్ను ప్రాణాలతో తగలబెట్టేస్తా అంటూ బెదిరింపులకి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. ఈ దారుణమైన అవమానంలో తన పిల్లలను కూడా భర్త ఇన్వాల్వ్ చేశాడని, తల్లిని గట్టిగా కొట్టమని పిల్లలను ఆర్డర్ చేశాడని, ఒక బిడ్డ చేత బలవంతంగా మూత్రం తాగించేలా చేశాడని ఆమె ఏడుస్తూ చెప్పుకొచ్చింది.

అయితే ఆమె భర్త జితేంద్ర తన భార్యపై సంచలన ఆరోపణలు చేశాడు.. తన భార్య ఫ్యామిలీని వదిలేసి వేరే వాళ్లతో వెళ్ళిపోయిందని, గతంలో తన బావతో, ఆ తర్వాత మేనల్లుడితో పారిపోయి మళ్లీ తిరిగి వచ్చిందని తెలిపాడు. అయితే ఈ ఆరోపణలను బాధితురాలు పూర్తిగా ఖండించింది. తన భర్తకు మొదటి నుండి అనుమానపు బుద్ధి ఉందని, కట్నం కోసం కూడా వేధించేవాడని, నలుగురు పిల్లలు పుట్టాక తను స్టెరిలైజేషన్ కూడా చేయించుకున్నానని, తనకు న్యాయం జరగాలని అండ్ ఆ కిరాతకుడికి కఠినమైన శిక్ష పడాలని డిమాండ్ చేసింది. ఆమె భర్తపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

 

 

 

 

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.