AI: అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది. అక్కడ ఒక షాప్‌ను నడుపుతున్న లూనా అనే ఏఐ మేనేజర్, తన కింద పనిచేసే ఒక మనిషిని ఉద్యోగం నుంచి తీసేయాలని తీర్పు చెప్పింది. కారణం ఏంటంటే.. సదరు ఉద్యోగి మొత్తం 23 రోజుల్లో ఏకంగా 17 రోజులు ఆలస్యంగా వచ్చాడు. ఏఐ చెప్పిన ఈ సిఫార్సును చూసి, స్టోర్ నిర్వాహకులు ఆ ఉద్యోగిని పనిలోంచి తీసేశారు.

అయితే ఈ నిర్ణయం ఏఐ ఏమీ తనంతట తాను తీసుకోలేదు. కొన్ని నెలల క్రితం ఎవరైనా ఆలస్యంగా వస్తే ఉద్యోగం ఊడుతుంది అని లూనానే ఒక రూల్ రాసుకుంది. కానీ ఆ తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయింది. దాంతో ఆ ఉద్యోగి నెలల తరబడి లేట్‌గా వస్తున్నా ఏఐ పట్టించుకోలేదు. చివరికి ఈ ప్రయోగం చేస్తున్న పరిశోధకులు కల్పించుకుని బాస్! నీ రూల్స్ ఒకసారి గుర్తుతెచ్చుకో.. ఆ ఉద్యోగి మనకు సెట్ అవుతాడా అని అడిగారు. అప్పుడు లూనా తన మెమరీ చెక్ చేసుకుని, ఇలాంటోడు మనకు వద్దే వద్దు, పంపించేయండి అని సలహా ఇచ్చింది.

Also Read : వైట్‌హౌస్‌కు కూతవేటు దూరంలో చైనా స్నైపర్: అమెరికాలో కలకలం!

ఆండన్ ల్యాబ్స్ అనే కంపెనీ ఏఐ సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఈ ఆండన్ మార్కెట్ అనే షాప్‌ను మొదలుపెట్టింది. లూనాకు ఏకంగా లక్ష డాలర్ల డబ్బులు, ఒక క్రెడిట్ కార్డు ఇచ్చి.. ఈ డబ్బులతో షాప్ నడిపి లాభాలు తీసుకురా అని చెప్పారు.

స్టోర్‌లో ఏం సరుకులు అమ్మాలి వాటి ధరలు ఎంత ఉండాలి షాప్ ఏ టైమ్‌కి తీయాలి ఎవరిని ఉద్యోగంలోకి తీసుకోవాలి అనేవన్నీ ఈ ఏఐ మేనేజరే చూసుకుంది. ఈ షాప్‌లో పుస్తకాలు, కొవ్వొత్తులు, ఆర్ట్ వస్తువులు అమ్ముతున్నారు. కానీ, వ్యాపారం అయితే సాగుతోంది గానీ ఇప్పటివరకు లాభాలు మాత్రం రాలేదు. పెట్టిన బడ్జెట్ లక్ష డాలర్ల నుంచి ఐదు నెలల్లో 61,186 డాలర్లకు పడిపోయింది.

ఏఐ రాబోయే రోజుల్లో ఎంత పవర్‌ఫుల్‌గా మారబోతోందో చెప్పడానికి ఈ ప్రయోగం ఒక ఉదాహరణ అని కంపెనీ సీఈఓ లూకాస్ పీటర్సన్ చెప్పారు. అయితే ఇదే టైమ్‌లో ఏఐకి ఉన్న బద్ధకం, పరిమితి కూడా బయటపడింది. రూల్స్ తయారు చేయడం వచ్చు గానీ, వాటిని గుర్తుపెట్టుకుని కరెక్ట్‌గా అమలు చేయడం ఏఐకి ఇంకా చేతకావడం లేదని ఈ ఘటన తేల్చేసింది.

Also Read : భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవం.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.