
Supreme Court : తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది ఎంపీల విషయంలో సుప్రీంకోర్టు కీలకమైన నోటీసులు ఇచ్చింది. ఆ ఎంపీలు పార్టీ మారి, మరో చిన్న పార్టీ అయిన NCPI తో కలిసి ఎన్డీయే వైపు వెళ్లారు. ఈ 20 మంది ఎంపీలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ టీఎంసీ నాయకుడు అభిషేక్ బెనర్జీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా ఈ విషయంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. ప్రధాన జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించి నోటీసులు జారీ చేసింది.
Also Read : ఢిల్లీలో 2300 దాటిన స్వైన్‌ఫ్లూ కేసులు…కేంద్రం సంచలన ప్రకటన!
ఎన్నికల్లో ఒక పార్టీ గుర్తుపై గెలిచి, వేరే పార్టీలోకి వెళ్లడం నిబంధనల ప్రకారం తప్పవుతుందని, కాబట్టి వారిపై అనర్హత వేటు వేయాలని టీఎంసీ గట్టిగా కోరుతోంది. కానీ ఆ ఎంపీలు మాత్రం తాము చేసింది సరైన కలయికే అని వాదిస్తున్నారు. ఈ విచారణ సమయంలో కోర్టు మొదట స్పీకర్‌కు కూడా నోటీసులు ఇద్దామనుకుంది. అయితే స్పీకర్ తరఫు వాదనలు వినిపించిన లాయర్ తుషార్ మెహతా, ఈ అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఇప్పటికే నోటీసులు జారీ చేశారని కోర్టుకు తెలిపారు.
దీనిపై స్పందించిన కోర్టు, కేవలం నోటీసులు ఇవ్వడమే కాకుండా, ఈ వ్యవహారాన్ని నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని సూచించింది. స్పీకర్ తరఫున లాయర్ స్వయంగా హాైజరై వివరాలు చెప్పడంతో, ప్రత్యేకంగా స్పీకర్‌కు నోటీసు ఇవ్వాల్సిన అవసరం రాలేదు. ఈ కేసులో కాకోలి ఘోష్, సుదీప్ బంధోపాధ్యాయ, శతాబ్ది రాయ్, రచన బెనర్జీ, సాయనీ ఘోష్, యూసఫ్ పఠాన్‌తో పాటు మొత్తం 20 మంది రెబెల్ ఎంపీలు ఉన్నారు. ఈ పరిణామం తమ పార్టీకి పెద్ద విజయమని తృణమూల్ నేతలు అంటున్నారు.
Also Read : లేచిన వెంటనే టీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. ఈ అనారోగ్య సమస్యల బారిన పడక తప్పదు!









