
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైపోయింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కూటమి పార్టీ విడతల వారీగా తమ అభ్యర్థులను ప్రకటిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే 36 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసిన TDP.. అందులో 7 మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్లు, 26 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయతీలకు ఛైర్పర్సన్ అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పుడు మరో 22 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను TDP అనౌన్స్ చేసింది. అందులో ఒక మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు 21 మున్సిపాలిటీలకు మేయర్, ఛైర్పర్సన్ల అభ్యర్థులను ప్రకటించింది.
మున్సిపల్ కార్పొరేషన్‌కు మేయర్ అభ్యర్థి
TDP రిలీజ్ చేసిన రెండో జాబితాలో మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా షేక్ అబ్దుల్ అబిదా పేరును పార్టీ అనౌన్స్ చేసింది.
మున్సిపాలిటీల ఛైర్పర్సన్ అభ్యర్థులు
ఒక కార్పొరేషన్‌తో పాటు 21 మున్సిపాలిటీలకు ఛైర్పర్సన్ అభ్యర్థులను పార్టీ ప్రకటించింది. అందులో..
ఆకివీడు – నిలోఫర్ షేక్
బేతంచర్ల – ఐ. లోకేష్ గౌడ్
బుచ్చిరెడ్డిపాలెం – దోడ్ల విజయలక్ష్మి
చీరాల – యెరిచర్ల హనీ స్పందన
డోన్ – కొట్ల సుజాతమ్మ
గుత్తి – గోవిందరాజులు తమిళ్ సెల్వి
గుంతకల్లు – యశోద
జంగారెడ్డిగూడెం – రొంగల అనుష
కదిరి – షేక్ సమీరా
కళ్యాణదుర్గం – బుట్న లక్ష్మి
కొండపల్లి – కన్నెకంటి అమూల్య
కొవ్వూరు – జొన్నలగడ్డ రాధారాణి
నాయుడుపేట – షకీరా
నందిగామ – శాకమూరి వంశీధర్
నందికొట్కూరు – ఈ.ఎం. సబురున్నిసా
నర్సీపట్నం – చింతకాయల పద్మావతి
ప్రొద్దుటూరు – నంద్యాల రాఘవరెడ్డి
వెంకటగిరి – దొంతు శారద
ఉయ్యూరు – చేదుర్తిపాటి ప్రవీణ్ కుమార్
ఏలేశ్వరం – యార్లగడ్డ అక్షిత
ఎమ్మిగనూరు – మాచాని సునీత.










