
బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్‌పై జరిగిన కాల్పుల కేసులో పోలీసులు కీలక పురోగతిని సాధించారు. ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ముంబైలో కాల్పులు జరిపిన తర్వాత పూణే-జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో పారిపోతున్న నిందితులను రాజస్థాన్‌లోని కోటాలో అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న డీఎస్పీ, సైబర్ సెల్ బృందం కేవలం 15 నిమిషాల్లోనే వల పన్ని.. రైలు మొత్తం సోదా చేసి ఆ ముగ్గురినీ పట్టుకున్నారు. వారు ఢిల్లీ మీదుగా నేపాల్‌కు పారిపోవాలని ప్లాన్ చేసుకున్నట్లు కోటా ఎస్పీ తేజస్విని గౌతమ్ తెలిపారు. వారిని త్వరలోనే ముంబై పోలీసులకు అప్పగించనున్నారు.
Actor Tiger Shroff Survives Assassination Attempt in Mumbai 🧵 pic.twitter.com/JVMMmxrEP1
— SILENT BRIEF (@SilentBriefHQ1) October 19, 2026
కాల్పులు జరిపిన వారిలో రేహన్, హృతిక్, ఒక మైనర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనిల్ పండిట్ అనే వ్యక్తి వీరిని సంప్రదించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ముగ్గురిలో హృతిక్ అనే నిందితుడు ర్యాపిడో రైడర్ అని పోలీసులు గుర్తించారు. ఇతడికి ఆ ప్రాంతమంతా బాగా తెలియడంతో హృతిక్‌ను సంప్రదించినట్లు పేర్కొన్నారు. అలాగే మరొక వ్యక్తి రేహన్ సోనిపత్‌లో వెల్డింగ్ పనిచేసేవాడు. దేవ్రు గ్రామానికి చెందిన అతడు.. తన తల్లి, తమ్ముడితో కలిసి నివసిస్తున్నాడు.
తొమ్మిదో తరగతిలో ఫెయిల్ అయి చదువు మానేసిన రేహాన్.. ఆ తర్వాత నేర ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఇందులో భాగంగానే చట్టవిరుద్ధంగా ఆయుధాలు కలిగి ఉన్నందుకు రేహాన్ గతంలో జైలుకు వెళ్లాడు. ఇక చివరి నిందితుడైన మైనర్ టైల్స్ వేసేవాడుగా గుర్తించారు. అతడు తన తండ్రి దగ్గర పని నేర్చుకుంటున్నట్లు తెలిపారు. ఆ మైనర్ తండ్రి వికలాంగుడని తెలిపారు.









