varanasi road accident
varanasi road accident

హైవేపై ఊహించని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్పార్పియో కారు నుజ్జు నుజ్జు అయింది. రోడ్డుపై రక్తం చింది శరీరాలు ఛిద్రమయ్యాయి. ప్రమాద ధాటికి ఫ్లైఓవర్ పైనుంచి ఒకరు కిందకు పడిపోయారు. ఈ ఘటనతో హైవే పై గందరగోళం నెలకొంది. నడిరోడ్డుపై చెల్లచెదురుగా పడి ఉన్న డెడ్‌బాడీలు చూసి వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని ఈ ప్రమాదంలో గాయపడిన మిగతావారిని సమీప హాస్పిటల్‌కు తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

వారణాసిలోని శివపూర్ ప్రాంతానికి చెందిన 8 మంది స్నేహితులు స్కార్పియో కారులో వింధ్యాచల్ పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకుని కాశీకి తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే రూపాపూర్ గ్రామం సమీపంలోని ఓవర్‌బ్రిడ్జిపైకి రాగానే.. వారిని కారును వెనుక నుండి వేగంగా వచ్చిన ఒక ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారులోని ఓ వ్యక్తి బ్రిడ్జి పైనుండి సుమారు 30 అడుగుల కిందకి రోడ్డుపై ఎగిరిపడ్డాడు.

కారు వెనుకభాగం మొత్తం నుజ్జునుజ్జు కావడంతో.. అందులో ఉన్న మరికొందరు సీట్ల మధ్య ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొనగా.. అటుగా వెళ్లినవారు వెంటనే పోలీసులకు తెలియజేశారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని కారులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు.

VIDEO

గ్యాస్ కట్టర్‌ సహాయంతో వాహనాన్ని కోసి.. లోపలున్న వారిని బయటకు తీశారు. అందులో నలుగురు అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో నలుగురిని సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులను అమన్ యాదవ్, గోలు, అలోక్ మిశ్రాలుగా గుర్తించారు. నాల్గవ మృతుడిని ఇంకా గుర్తించాల్సి ఉంది. ప్రమాదానికి కారణమైన ట్రక్కును పోలీసులు సీజ్ చేసి డ్రైవర్‌ను అరెస్టు చేశారు.