
కేరళలోని కొచ్చిలో దారుణ ఘటన వెలుగుచూసింది. రైల్వే ట్రాక్ సమీపంలో 31 ఏళ్ల అజిత నాయక్ అనే వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మొదట దీనిని రైలు ప్రమాదంగా భావించిన పోలీసులు.. ఆ తర్వాత డెడ్ బాడీని పరిశీలించి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అరంతరం ప్రాథమిక విచారణలో ఆ వ్యక్తి రైలు ఢీకొనడం వల్ల చనిపోలేదని తేలింది. దీంతో వివరాలు తెలుసుకుని మృతుడి ఇంటికి వెళ్లారు. అక్కడ అతడి భార్యను విచారించారు.
Also Read : నూడుల్స్ వల్ల కాదు.. ఫ్యామిలీ డెత్ కేసులో బిగ్ ట్విస్ట్!
ఈ విచారణలో అనేక విషయాల్లో తడబడిపోయిన ఆ మహిళపై పోలీసులకు అనుమానం పెరిగింది. ఈ క్రమంలో మరింత డెప్త్‌గా వారి స్టైల్లో విచారించగా.. అసలు నిజం బయటపడింది. తన భర్తను హత్య చేసింది తానేనని ఆ మహిళ ఒప్పుకుంది. ఆమె సమాధానంతో పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇంతకీ ఆ మహిళ తన భర్తను హత్య చేయడానికి గల కారణం ఏంటి?..అనే దాని గురించి తెలుసుకుందాం.
ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన 31 ఏళ్ల అజిత నాయక్.. ఆ మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. అయితే ఆ మహిళకు మొదటి వివాహం ద్వారా జన్మించిన 16 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. చాలా సంవత్సరాలుగా వీరు ముగ్గురు కలిసి కేరళలోని పుతుక్కలవట్టం ప్రాంతంలోని రైల్వే ట్రాక్‌ల సమీపంలో నివసిస్తున్నారు. అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో అజిత నాయక్ తన కూతురుపై కన్నేసి అత్యాచారయత్నానికి తెగబడ్డాడు. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన ఆ మహిళ తన భర్త తలపై దాడి చేసి చంపేసింది. తర్వాత అతను చనిపోయాడని నిర్థారించుకుని.. మృతదేహాన్ని ఈడ్చుకునివెళ్లి రైల్వే ట్రాక్ సమీపంలో పడేసింది.
అయితే అక్టోబర్ 17వ తేదీ రాత్రి ఎర్నాకులం నార్త్ – ఎడపల్లి రైల్వే స్టేషన్ల మధ్య పట్టాల సమీపంలో పడిఉన్న ఆ డెడ్ బాడీని ఒక లోకో పైలట్ గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ దారుణం వెనుక ఉన్న అసలు నిజాన్ని బట్టబయలు చేశారు.
Also Read : భార్య బర్త్ డే రోజే విషాదం : ఫ్లాట్‌లో భార్యాభర్తల మృతదేహాలు.. చివరి మెయిల్ కలకలం!









