CULT TRAILER
CULT TRAILER

విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు మరో కొత్త సినిమా వచ్చేస్తోంది. ‘ఫలక్ నుమా దాస్’, ‘దాస్ కా ధమ్కీ’ వంటి సినిమాలకు దర్శకత్వం చేసి.. హీరోగా నటించిన ఈ సినిమాలు మంచి బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్నాయి. ఆ తర్వాత కూడా పలు సినిమాలు చేసి సూపర్ అనిపించుకున్నాడు. కానీ మధ్యలో ఏమైందో ఏమో కానీ.. రొట్టకొట్టుడు స్టోరీలతో వరుస ఫ్లాప్‌లు, డిజాస్టర్‌లు చూశాడు. ఇక ఇలా లాభం లేదనుకుని మళ్లీ డైరెక్షన్‌లోకి అడుగుపెట్టాడు.

అదే ‘కల్ట్’ (Cult Movie). ఇందులో విశ్వక్ సేన్ సరసన గాయత్రి భరద్వాజ్ హీరోగా నటిస్తోంది. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు ప్రేక్షకుల్లో మంచి అంచనాలను పెంచేశాయి. ఈ మూవీ ఈ నెల 30న థియేటర్లలో రిలీజ్ కానుండటంతో మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. తాజాగా పవర్‌ఫుల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

Also Read : హీరో టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. దూసుకొచ్చిన బుల్లెట్లు.. డ్రైవర్ పరిస్థితి విషమం!

ఈ ట్రైలర్ చూస్తుంటే.. ‘స్క్విడ్ గేమ్’ మూవీ గుర్తుకురాక మానదు. ఒకరోజు రాత్రి పబ్‌లో 300 మంది పార్టీ చేసుకుంటారు. వారందరినీ లోపలే లాక్ చేసి ఒక గేమ్ పెడతారు. అందులో ఓడిపోయిన వారిని చంపేస్తుంటారు. మరి లోపలున్న వీళ్లంతా బయటకి ఎలా వచ్చారు?.. ఈ సెటప్ వెనుక ప్లాన్ ఏంటి?.. ఎందుకు ఇలా చేస్తారు? అనేది మూవీ చూసి తెలుసుకోవలసిందే. ఇందులో వయలెన్స్ ఎక్కువగా ఉండటంతో యువత మాత్రమే చూసే ఛాన్స్ కనిపిస్తుంది.

Also Read : పునీత్ చనిపోయే ముందు ఏం జరిగిందంటే.. ఐదేళ్ల తర్వాత అసలు విషయం బయటపెట్టిన డాక్టర్

CULT TRAILER – CLICK