Amazon Great Indian Festival Sale
Amazon Great Indian Festival Sale

ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ఇటీవలే అదిరిపోయే సేల్ ప్రకటించింది. ఈ ఏడాదిలో తన అతిపెద్ద సేల్‌ అయిన ‘Amazon Great Indian Festival Sale’ను అనౌన్స్ చేసింది. ఈ సేల్ ఈ నెల 8వ తేదీన భారీ స్థాయిలో ప్రారంభం కానుంది. ఈ సేల్ సమయంలో వినియోగదారులు దాదాపు 85 శాతం వరకు అనేక ప్రొడెక్టులపై ఆఫర్లు, డిస్కౌంట్లు పొందవచ్చు.

అంతేకాకుండా అమెజాన్ సేల్ సమయంలో బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై 10% వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. కేవలం SBI కార్డులు ఉన్నవారికి ఇది వర్తిస్తుంది. కాగా కంపెనీ అనేక ఆఫర్లు, డిస్కౌంట్లను ఇప్పటికే వెల్లడించింది. వాటిలో రూ.999 నుండి ప్రారంభమయ్యే ఆఫర్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ Amazon Great Indian Festival Saleలో స్మార్ట్‌ఫోన్లపై కిక్కిచ్చే తగ్గింపులు అందుబాటులో ఉంచింది.

ఈ సేల్‌లో Iphone ను కొనుక్కోవాలనుకునే వారికి మంచి అవకాశమనే చెప్పాలి. ఇటీవలే యాపిల్ కంపెనీ తన సిరీస్‌లోని అన్ని మోడల్స్ ధరలను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది iphone ను కొనుక్కోవాలనుకున్నా.. ధర పెంపుతో వెనకడుగు వేశారు. కానీ ఇప్పుడు ఈ సేల్‌లో ఐఫోన్లపై భారీ తగ్గింపు లభిస్తుంది. iphone 16, iphone 17 సహా మరిన్ని సిరీస్ మోడళ్ళు తక్కువ ధరకే పొందొచ్చు. ఈ Great Indian Festival Saleలో అన్ని ఆఫర్లతో కలిపి iphone 16ను రూ.71,999 వరకు కొనుక్కోవచ్చు. కంపెనీ దీనిని ‘డీల్ ఆఫ్ ది ఇయర్’గా కూడా పేర్కొంది. అలాగే సేల్ సమయంలో Samsung Galaxy S25 Ultraను కూడా తక్కువ ధరకే పొందొచ్చు.

ఇంకా ఈ సేల్‌లో ఛార్జర్లు, కేబుల్స్, TWS మొదలైన మొబైల్ యాక్సెసరీలు తగ్గింపు ధరలతో అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇళ్లు, కిచెన్, అవుట్‌డోర్ కేటగిరీలలోని అన్ని ఉత్పత్తులు 80% వరకు తగ్గింపుతో లభిస్తాయి. ఇవి మాత్రమే కాకుండా ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ గ్లాసెస్, మౌస్‌లు మొదలైన ఎలక్ట్రానిక్స్ వస్తువులు కూడా 80 శాతం వరకు తగ్గింపు ధరలకు పొందొచ్చు.