
UPI ద్వారా చేసే డిజిటల్ లావాదేవీలపై ఛార్జీలు విధించే పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్-2007 సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఎలాంటి చర్చ లేకుండానే ఈ బిల్లు ఆమెదం పొందింది. ఇప్పటివరకు ఆన్‌లైన్ చెల్లింపులపై ఫీజులు వసూలు చేయకూడదనే పాత చట్టాన్ని రద్దు చేసి, ప్రభుత్వం అనుకుంటే బ్యాంకులు ఇకపై కొంత రుసుము వసూలు చేసుకోవచ్చని కొత్త సవరణ తెచ్చారు.
Also Read : ఢిల్లీ నుంచి రాంచీకి పాకిన జెన్ జీ.. జార్ఖండ్‌లో అసలు ఏం జరుగుతోంది?
మనం బ్యాంకు ద్వారా ఆర్‌టిజిఎస్ , నెఫ్ట్ సేవలతో డబ్బులు పంపితే కొంత ఛార్జీ పడుతుంది. కానీ యుపిఐకి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ఫీజు లేదు. అయితే డిజిటల్ పేమెంట్లు నడిపే బ్యాంకులు, యాప్ కంపెనీలు కూడా నష్టపోకుండా నడవాలంటే వినియోగదారులు, చిన్న వ్యాపారుల నుంచి కొద్దిగా ఛార్జీలు వసూలు చేయడం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ విషయమై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ… డిజిటల్ సేవలను నిరంతరం నడపడానికి, సాంకేతిక వ్యవస్థను పెంచడానికి చాలా ఖర్చవుతుందని, ఆ ఖర్చును ఎవరో ఒకరు భరించాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఈ బిల్లు పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చాక ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా ఏయే ఆన్‌లైన్ పేమెంట్లకు ఎంత ఛార్జ్ పడుతుందో స్పష్టంగా ప్రకటిస్తుంది.
Also Read : UPI యూజర్లకు బిగ్ షాక్…. ట్రాన్సెక్షన్స్‌పై ఛార్జీలు.!









