
Brij Bhushan : మహిళా రెజ్లర్లు పెట్టిన లైంగిక వేధింపుల కేసులో భారత కుస్తీ సమాచార మాజీ చీఫ్, మాజీ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో బ్రిజ్ భూషణ్ తో పాటు సహ నిందితుడిగా ఉన్న వినోద్ తోమర్‌ను కూడా కోర్టు నిర్దోషులుగా తేలుస్తూ విడుదల చేసింది.
Also Read : మరో పేపర్ లీక్ కలకలం: విద్యార్థుల పోరాటానికి ‘కాక్రోచ్ జనతా పార్టీ’ మద్దతు!
తీర్పు వెలువడిన వెంటనే బ్రిజ్ భూషణ్ మీడియాతో మాట్లాడుతూ.. తనపై ఆరోపణలు వచ్చిన నాడే, ఒకవేళ ఆరోపణలు నిజమని తేలితే ఉరి వేసుకుంటానని చెప్పానని, నేడు కోర్టు తనను నిర్దోషిగా విడుదల చేస్తూ గౌరవప్రదంగా నిర్దోషి అనే పదాన్ని ఉపయోగించిందని ఆయన తెలిపారు. గతం గతంలా వదిలేయాలని ఆయన అన్నారు.
ఈ కేసుకు సంబంధించి గతంలో మహిళా రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌గా బ్రిజ్ భూషణ్ తన పదవిలో ఉన్న సమయంలో తమను లైంగిక వేధింపులకు గురిచేశారని వారు ఆరోపించారు. ఆ ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత, 2023 జూన్ 15న ఏకంగా 1500 పేజీలతో కూడిన చార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేశారు.
భారత్ తో పాటు విదేశాలకు చెందిన పలువురు మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ఈ నిందితులు విచారణను ఎదుర్కొన్నారు. డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిగా తాను అధికారంలో ఉన్న కాలంలో బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధించారంటూ ఈ క్రీడాకారిణులు తీవ్ర ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే.
Also Read : BJPకి దిమ్మతిరిగే షాక్.. 30 ఏళ్ల కంచుకోట బద్దలు!









