
దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగం విపరీతంగా పెరిగింది. తక్కువ ఖర్చు, ఎక్కువ దూరం ప్రయాణించడంతో చాలా మంది వీటిపైనే ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం పెట్రోల్ బైక్‌లకు స్వస్తి పలికి ఎలక్ట్రిక్ వాహనాల వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతోపాటు ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ప్రోత్సహించడంతో వీటికి డిమాండ్ పెరిగింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఎలక్ట్రిక్ వాహనాలపై భారీగా సబ్సిడీ అందించి వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అందులో దేశ రాజధాని ఢిల్లీ ముందువరుసలో ఉంది.
ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల (Electric vehicles) కొనుగోళ్లను ప్రోత్సహించడానికి ఢిల్లీ ప్రభుత్వం(Delhi Government) ఒక కొత్త ఎలక్ట్రిక్ వాహన సబ్సిడీని (Electric vehicle subsidy) అమలు చేసింది. దీని ప్రకారం.. కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేసే వారికి రూ.30,000 నుండి రూ.1 లక్ష వరకు సబ్సిడీ లభిస్తుంది. అయితే దీనికి ఒక కండీషన్ పెట్టింది. ఈసారి ‘రీజనరేటివ్ బ్రేకింగ్’ (Regenerative Braking) ఉన్న వాహనాలకు మాత్రమే ఈ సబ్సిడీ వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. కొత్త ఎలక్ట్రిక్ వాహన పాలసీలో ఈ టెక్నాలజీని తప్పనిసరి చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే గతంలో కేవలం ఖరీదైన, ప్రీమియం మోడళ్ల వాహనాలకు మాత్రమే ఈ ‘రీజనరేటివ్ బ్రేకింగ్’ అనే ఫీచర్ ఉండేది. కానీ ఇప్పుడు సబ్సిడీ పొందాలనుకునే అన్ని ఈవీ వెహికల్స్‌కు ప్రభుత్వం ఈ ఫీచర్‌ను తప్పనిసరి చేసింది. అలాగే వీటితో పాటు ఎలక్ట్రిక్ బైక్ మైలేజీ కనీసం 80 కి.మీ ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి వెహికల్స్‌కు మూడేళ్లు లేదా 20వేల కి.మీ వరకు వారంటీ కూడా లభిస్తుంది.
Also Read : Realme నుంచి ఊరమాస్ మొబైల్.. 8,000 mAh బ్యాటరీతో ఫీచర్ కిర్రాక్..!
రీజనరేటివ్ బ్రేకింగ్ అంటే ఏంటి?
రీజనరేటివ్ బ్రేకింగ్ అంటే.. వాహనం వేగం తగ్గినప్పుడు బ్యాటరీ రీఛార్జ్ అయ్యే టెక్నాలజీ ఫీచర్ ఇది. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనానికి బ్రేక్ వేసినపుడు లేదా యాక్సిలరేటర్ తగ్గించినపుడు వాహనం స్పీడ్ తగ్గుతుంది. ఆ సమయంలో కొంత శక్తి వేడి రూపంలో వృధాగా పోతుంది. అందువల్ల ఈ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్.. ఆ వృధా అయ్యే శక్తిని వదిలిపెట్టకుండా.. దానిని ఎలక్ట్రిక్ శక్తిగా మార్చి బ్యాటరీలో స్టోర్ చేస్తుంది. దీనివల్ల బ్యాటరీ రీఛార్జ్ అయ్యి వాహనం మైలేజీ పెరగడానికి సహాయపడుతుంది. ఈ ఫీచర్ ఫ్యూచర్ ఎలక్ట్రిక్ వెహికల్స్‌లలో అత్యంత కీలకమైన టెక్నాలజీగా నిలవనుంది.
ఈ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ విధానం ప్రకారం.. ఢిల్లీ ప్రభుత్వం వివిధ రకాల ఈవీల కొనుగోలుపై భారీ సబ్సిడీలు అందిస్తుంది. టూ వీలర్, త్రీ వీలర్, చిన్న సరుకు రవాణా వెహికల్స్‌పై రూ.30వేల నుండి రూ.1 లక్ష వరకు ప్రత్యక్ష సబ్సిడీని అందిస్తోంది. ఈ సబ్సిడీలో ఎలక్ట్రిక్ టూ వీలర్ వాహనాలపై రూ.30,000 వరకు, ఎలక్ట్రిక్ త్రీ వీలర్ వాహనాలపై రూ.50,000 వరకు సబ్సిడీ అందుబాటులో ఉంది. అలాగే చిన్న సరుకు రవాణా వాహనాలు లేదా ట్రక్కులపై రూ.1 లక్ష వరకు సబ్సిడీ లభిస్తుంది. దీంతో పాటు ఎక్స్-షోరూమ్ ధర రూ.30 లక్షల వరకు ఉన్న ఎలక్ట్రిక్ కార్లకు రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల నుండి మినహాయింపు ఉంది.
Also Read : రైతాంగానికి గుడ్‌న్యూస్.. ప్రాణాంతక గడ్డి మందు పారాక్వాట్‌ను నిషేధించిన ప్రభుత్వం..!









