
PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ కీలక కామెంట్స్ చేశారు. ఎన్డీఏ నుంచి కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన సభ్యులను ఉద్దేశించి మోదీ ప్రసగించారు. దాదాపుగా ముప్పై మందికి పైగా ఎంపీలతో ప్రధాని తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఢిల్లీ చాలా ప్రమాదకరమైన ప్రదేశమని మీరు ఎవరిని కలుస్తున్నారు, ఎక్కడ కలుస్తున్నారనే దానిపై జాగ్రత్త అవసరమని మోదీ వారిని హెచ్చరించారు.
గంటకు పైగా సాగిన ఈ మీటింగ్ లో వ్యక్తిగత విషయాలతో పాటుగా ప్రతిపక్షాలతో వ్యవహరించడం వరకు అనేక అంశాలపై కొత్త ఎంపీలకు మోడీ కీలక సూచనలు అందించారు. ఎంపీలు తమ లెటర్‌హెడ్‌ల దుర్వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఫోన్లలో ప్రజలతో దురుసుగా ప్రవర్తించవద్దని చెప్పారు. అలాగే ప్రతిపక్ష సభ్యులతో సహా తోటి పార్లమెంటు సభ్యులందరి నుండి నేర్చుకోవాలని ఆయన ఎంపీలను కోరారు. సభకు వీలైనంత ఎక్కువ సమయం కేటాయించాలని, 100% హాజరు శాతం ఉండేలా చూసుకోవాలని ప్రధాని కోరారు.
Also Read : దిమ్మతిరిగే షాక్.. ఎయిర్‌టెల్ రూ.299 ప్లాన్ బంద్!
ఇక మనం ఏ పని చేస్తున్నామో, ఎవరితో ఉంటున్నామో… పూర్తిగా దాని మీదే మనసు పెట్టాలన్నారు మోదీ. ఏ సమయంలో ఏది చేయాలో దానిపైనే పూర్తిగా దృష్టి పెడితేనే అనుకున్న ఫలితాలు వస్తాయని సూచించారు. ఇక తాను విదేశాలకు వెళ్లినప్పుడు.. విమానం ఎక్కిన వెంటనే, నేను ఏ దేశానికి వెళ్తున్నానో ఆ దేశపు టైమ్‌కి నా వాచ్‌ను మార్చుకుంటానని తెలిపారు. మన మైండ్ ఆటోమేటిక్‌గా ఆ టైమ్‌కి సెట్ అయిపోతుంది, కాబట్టి తనకు ఎలాంటి ఇబ్బందీ ఉండదన్నారు. దీనిని జెట్ లాగ్ అని అంటారని మోదీ వివరించారు.
ఈ క్రమంలో మోదీ దినచర్య గురించి ఎంపీలు ప్రశ్నంచగా మోదీ ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. తాను మంచం ఎక్కిన ఎనిమిది సెకన్లలోపు నిద్రపోతానని, కేవలం మూడు గంటలు మాత్రమే డీప్ స్లీప్ లోకి వెళుతానని వెల్లడించారు.
కాగా ఆప్, తృణమూల్ కాంగ్రెస్, బిజెడి వంటి వివిధ పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు ఎన్డీయే కూటమిలో చేరారు. కాగా ఆప్ నుంచి ఏడుగురు ఎంపీలు బీజేపీలో చేరారు. తృణమూల్ కాంగ్రెస్ నామినేట్ చేసిన ముగ్గురు ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ ముగ్గురు ఎంపీలు – సుస్మితా దేవ్, సుఖేందు శేఖర్ రాయ్, ప్రకాష్ చిక్ బరైక్. ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీ బలం 117 స్థానాలుగా ఉంది. NDA కూటమి మొత్తం బలం 152 స్థానాలకు చేరుకుంది.
Also Read : వీడియో కాల్లో తండ్రికి అంత్యక్రియులు.. ఇంకెక్కడి బంధాలు?









