
చాలా మందికి ఉదయం, సాయంత్రం ఒక కప్పు వేడి వేడి టీ తాగే అలవాటు ఉంటుంది. టీ తాగితే రోజంతా ఎంతో ఉత్సాహంగా, ప్రశాంతంగా ఉంటుంది. అయితే టీ తాగేటప్పుడు చాలా మంది బిస్కెట్లు, బజ్జీలు, పకోడీలు వంటి రకరకాల స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేస్తారు. కానీ టీతో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల తీవ్రమైన జీర్ణ సమస్యలు రావడంతో పాటు అనారోగ్యం బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే టీతో పాటు అస్సలు తీసుకోకూడని ఆ 5 ఆహార పదార్థాలు ఏంటో చూద్దాం.
Also Read : పుణె కేసులో ట్విస్ట్…చంపేంతవరకు ప్రేమను ఒలకబోస్తూనే..లోయలోకి తోసింది
శనగపిండి పదార్థాలు
చాలా మందికి వర్షం పడినా లేదా సాయంత్రం అయినా వేడి టీతో పాటు పకోడీలు, సమోసాలు లేదా బజ్జీలు తినడం ఇష్టం. కానీ శనగపిండితో చేసిన వస్తువులను టీతో కలిపి తింటే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. ఇది కడుపు ఉబ్బరం, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలకు దారితీస్తుంది.
నిమ్మకాయ
కొందరు బరువు తగ్గడానికని లేదా రుచి కోసమని ‘లెమన్ టీ’ తాగుతుంటారు. అయితే టీ ఆకులలో ఉండే కెఫిన్, నిమ్మకాయలోని ఆమ్ల గుణాలు కలిసినప్పుడు కడుపులో గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి. ఇది జీర్ణక్రియను మందగించేలా చేస్తుంది.
పసుపు ఎక్కువగా ఉండే ఆహారాలు
టీ తాగిన వెంటనే లేదా టీతో పాటు పసుపు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. పసుపు, టీ ఆకుల్లోని రసాయనాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా పనిచేస్తాయి. దీనివల్ల కడుపులో మంట, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు పెరుగుతాయి.
చల్లని పదార్థాలు
వేడి వేడి టీ తాగిన వెంటనే ఐస్‌క్రీమ్ తినడం లేదా ఫ్రిజ్ లోని చల్లని పదార్థాలు తీసుకోవడం చాలా ప్రమాదకరం. వేడి, చల్లని పదార్థాలు ఒకేసారి పొట్టలోకి వెళ్లడం వల్ల జీర్ణ ప్రక్రియ దెబ్బతింటుంది. కడుపునొప్పి, వికారం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. టీ తాగిన తర్వాత కనీసం అరగంట వరకు చల్లని పదార్థాలకు దూరంగా ఉండాలి.
ఐరన్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు
టీ తాగే సమయంలో ఆకుకూరలు లేదా ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తినకూడదు. టీలో ఉండే టానిన్స్, ఆక్సలేట్లు అనే పదార్థాలు.. మనం తినే ఆహారంలోని ఐరన్‌ను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల శరీరానికి పోషకాలు అందవు. సో టీతో పాటు ఈ పదార్థాలను ఎప్పుడు తీసుకోవద్దు.
Also Read : రూమర్స్‌కు ఒకే ఒక్క ఫొటోతో చెక్: సీఎం విజయ్‌కు త్రిష అదిరిపోయే బర్త్‌డే సర్ప్రైజ్..









