India :  భారత్ రాఫెల్ యుద్ధ విమానాలు, బ్రహ్మోస్ లేదా అగ్ని-5 మిసైల్స్ లేకుండానే శత్రువులను దెబ్బతీసే సరికొత్త రక్షణ వ్యవస్థను తయారు చేస్తోంది. యుద్ధాల్లో డ్రోన్ల వాడకం పెరగడంతో, శత్రువులు ఎవరూ జామ్ చేయలేని ప్రత్యేక డ్రోన్ సిస్టమ్‌ను డీఆర్‌డీఓ సిద్ధం చేస్తోంది. దీనిని క్లోజ్ ఫార్మేషన్ ఫ్లయింగ్ ఆఫ్ మల్టిపుల్ డ్రోన్స్ అని పిలుస్తున్నారు.

ఈ సరికొత్త సైనిక డ్రోన్ టెక్నాలజీని తయారు చేయడానికి మన దేశంలోని స్టార్టప్‌లు, చిన్న కంపెనీలను డీఆర్‌డీఓ ఆహ్వానించింది. ఇందులో 50 డ్రోన్‌లు కేవలం అర మీటర్ దూరంలోనే ఉంటూ, ఒకదానికొకటి ఢీకొనకుండా కచ్చితంగా ఎగిరేలా డ్రోన్ల గుంపును తయారు చేయనున్నారు. దేశంలోనే కొత్త ఆలోచనలను ప్రోత్సహించడానికి డీఆర్‌డీఓ ఈ అవకాశాన్నిచ్చింది. భవిష్యత్ యుద్ధాల్లో డ్రోన్ల పాత్ర చాలా ముఖ్యం కాబట్టి దీనికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

Also Read : నోరుజారి మాట్లాడా మోదీజీ.. క్షమించండి : యువతీ వీడియో వైరల్

గతంలో జరిగిన ఆపరేషన్ల ద్వారా నిఘా పెట్టడానికి, శత్రువులపై కచ్చితమైన దాడులు చేయడానికి డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడ్డాయని తేలింది. అందుకే భవిష్యత్ కోసం మన దేశంలోనే సురక్షితమైన డ్రోన్ నెట్‌వర్క్‌ను తయారు చేయాలని నిర్ణయించారు. ఈ డ్రోన్ల గుంపులో ఒక ప్రధాన డ్రోన్ ఉంటుంది. ఇది మిగతా 49 డ్రోన్లను నడిపిస్తుంది. గ్రౌండ్ నుంచి వచ్చే ఆదేశాలను మాస్టర్ డ్రోన్ తీసుకుని మిగతా వాటికి ఇస్తుంది. అన్ని డ్రోన్‌లు కేవలం 500 మింటమీటర్ల దూరంలో ఎగురుతున్నప్పటికీ, ఏ మాత్రం ఢీకొనకుండా చాలా పక్కాగా తమ స్థానంలోనే ఉండాలి..

ఈ డ్రోన్‌లను చాలా కష్టమైన వాతావరణంలో, ఎత్తైన పర్వత ప్రాంతాల్లో కూడా వాడవచ్చు. పెద్ద ఈదురుగాలులు వీచినా ఇవి కదలవు. శత్రువులు కమ్యూనికేషన్ సిస్టమ్‌ను జామ్ చేసినా ఇవి పనిచేసేలా పటిష్టంగా తయారు చేస్తున్నారు. ప్రతి డ్రోన్ రెండు కిలోల బరువును మోసుకెళ్లగలగాలి. ప్యాకింగ్ విప్పిన ఐదు నిమిషాల్లోనే ఇవి ఎగిరేందుకు సిద్ధం కావాలి. బ్యాటరీ కనీసం 30 నిమిషాలు పనిచేయాలి, కేవలం 15 నిమిషాల్లోనే మళ్లీ ఛార్జ్ కావాలి.

మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ డ్రోన్లలో కనీసం 70 శాతం మన దేశంలో తయారైనవే వాడాలి. బయటి దేశాల నుంచి తెచ్చిన విడిభాగాలను వాడకూడదు. ఈ ప్రాజెక్ట్ ఖర్చులో 90 శాతం డీఆర్‌డీఓనే ఇస్తుంది. ఎంపిక చేసిన కంపెనీ ఏడాదిలోపు మోడల్‌ను తయారు చేసి ఇవ్వాలి. ఆ తర్వాత వాటిని పరీక్షించి, 24 నెలలు పూర్తయ్యేసరికి 50 డ్రోన్‌లు, బ్యాటరీలు, సాఫ్ట్‌వేర్‌ను డీఆర్‌డీఓకు అప్పగించాలి. ఇది మన సైన్యానికి ఎంతో బలానిస్తుంది.

Also Read : రీల్స్‌తోనే సరిపెడతారా..కేసులు ఎత్తేయ్యరా… ప్రధాని మోడీ పై సీజేపీ చీఫ్‌ సంచలన వ్యాఖ్యలు..

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.