
Karnataka : కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదించిన తుది జాబితా ఆధారంగా ఇవాళే కర్ణాటక కేబినెట్ విస్తరణ జరగనుంది. పార్టీ అధిష్టానం పరిశీలన తర్వాత దాదాపు 18 నుంచి 20 మంది కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ భేటీ అనంతరం ఏఐసీసీ ఈ జాబితాను అధికారికంగా విడుదల చేయనుంది. ఆ తర్వాత సీఎం శివకుమార్ ఈ జాబితాను రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాల్‌కు అందజేయనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు లోక్‌భవన్‌లో నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే అవకాశం ఉంది.
ఈ మంత్రివర్గ విస్తరణలో ప్రాంతీయ, కుల, సామాజిక, మత సమీకరణాలతో పాటు మహిళా ప్రాతినిధ్యానికి కూడా కాంగ్రెస్ నాయకత్వం పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వివిధ సామాజిక వర్గాల మధ్య సమతుల్యత దెబ్బతినకుండా పార్టీ అధిష్టానం ఈ జాబితాను అత్యంత జాగ్రత్తగా కసరత్తు చేసి తుదిరూపు ఇచ్చింది.
Also Read : మోదీపై మైనర్ బాలిక కామెంట్స్… ఢిల్లీ పోలీసులు సంచలన నిర్ణయం!
మంత్రివర్గ రేసులో వినిపిస్తున్న ప్రధాన పేర్లు:
- పొన్నన్న
- రిజ్వాన్ అర్షద్
- ఎస్.ఎస్. మల్లికార్జున్
- లక్ష్మణ్ సవది
- యశ్వంత్‌రాయ గౌడ పాటిల్
- శరత్ బచేగౌడ
- శివలింగే గౌడ
- చెలువరాయస్వామి
- సంతోష్ లాడ్
- అజయ్ సింగ్
- నయన మోటమ్మ
- పుట్టరంగ శెట్టి
- మంకాల్ వైద్య
- రఘుమూర్తి
- శివరాజ్ తంగడగి
- లక్ష్మి హెబ్బాల్కర్
- మధు బంగారప్ప
- నారాయణస్వామి
ప్రస్తుతం కర్ణాటకలో ముఖ్యమంత్రితో కలుపుకుని కేవలం 14 మంత్రులు మాత్రమే ఉండగా, రాజ్యాంగ నిబంధనల ప్రకారం గరిష్టంగా 34 మంది వరకు మంత్రులు ఉండే అవకాశం ఉంది. దీంతో మిగిలిన ఖాళీలను భర్తీ చేస్తూ అధిష్టానం ఈ విస్తరణను చేపట్టింది. ఈ కేబినెట్ కసరత్తు నేపథ్యంలో ఢిల్లీ పెద్దలతో పాటు సీఎం శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేసీ వేణుగోపాల్, రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా తదితరులు గత కొన్ని రోజులుగా తీవ్ర మంతనాలు జరిపారు.
Also Read : అమెజాన్ కొత్త సేల్ వచ్చేసిందోచ్.. స్మార్ట్‌ఫోన్స్, ఏసీలు, ఫ్రిడ్జ్‌లపై భారీ డిస్కౌంట్స్..!









