
Mark Zuckerberg : ప్రధాని మోదీకి మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు చెప్పారు. ఫేస్ బుక్ లో మోదీ వీడియోను తొలిగించడం పట్ల ఆయన క్షమాపణలు కోరారు. తమ ప్లాట్‌ఫారమ్‌లలో పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన అసభ్యకర చిత్రాలు (CSAM), డీప్‌ఫేక్ కంటెంట్ ప్రచారం కావడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. కంటెంట్ నియంత్రణలో తప్పులు జరిగాయని మెటా అంగీకరించింది. కొన్ని రకాల కంటెంట్‌ను బూస్ట్ చేయడానికి.. భారీగా డబ్బులు తీసుకున్నట్టు మెటా అంగీకరించింది. ఫ్లాట్‌ఫామ్ నిర్వహణలో తీవ్ర పొరపాట్లకు మార్క్ జుకర్‌బర్గ్ బహిరంగ క్షమాపణలు చెప్పారు.
కాగా నీట్ ఎగ్జామ్ లీకేజీపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో జరిగిన నిరసనల మధ్య, ప్రధాని మోదీ యువతను ఉద్దేశించి చేసిన ఓ సెల్ఫీ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోను మెటా తొలిగించడం వివాదాస్పదంగా మారింది. ఫేస్బుక్ నుంచి ప్రధాని వీడియోను కొద్దిసేపు తొలగించడంపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణ చెప్పాలని ఐటీ పార్లమెంటరీ ప్యానెల్ డిమాండ్ చేసింది. జుకర్‌బర్గ్ మూడు రోజుల్లోగా క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన రక్షణను కోల్పోతారని ఐటీ పార్లమెంటరీ స్థాయీ సంఘం డిమాండ్ చేసిన నేపథ్యంలో మెటా దిగివచ్చింది.
Also Read : దిమ్మతిరిగే షాక్.. ఎయిర్టెల్ రూ.299 ప్లాన్ బంద్!
Meta CEO Mark Zuckerberg apologises for CSAM content, deepfake content, and errors in operating the platform: SOURCES
— TIMES NOW (@TimesNow) August 5, 2026
Also Read : డెలివరీ బాయ్ దారుణం : ఫుల్ గా తాగి.. ఒంటరిగా ఉందని యువతి ఇంట్లోకి దూరబోయి!









