
Prashant Kishor : బిహార్‌లోనిబ్యాంకిపూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. జన సూరజ్ పార్టీ (JSP) చీఫ్ ప్రశాంత్ కిషోర్ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పేపర్ లీకేజీల అనంతర పరిణామాల నేపథ్యంలో, యువత, ప్రజల నాడి ఎలా ఉందనేది తెలిపే తొలి ఎన్నికలు కావడంతో ఈ బైపోల్స్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Also Read : కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ.. 18 మంది ప్రమాణస్వీకారం
బీజేపీ కంచుకోటగా ఉన్న బ్యాంకిపూర్‌లో బీజేపీ అభ్యర్థిగా నీరజ్ కుమార్ సిన్హా బరిలో ఉన్నారు. ఇక్కడ నుండి ఏ బీజేపీ అభ్యర్థి కూడా ఎన్నడూ ఓడిపోలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఆయన ఖాళీ చేసిన ఈ స్థానానికి ఉపఎన్నిక వచ్చింది. అయితే, బీజేపీ శిబిరంలో తలెత్తిన కొన్ని అనూహ్య పరిణామాలు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగడం ఈ ఎన్నికలపై అందరి దృష్టిని ఆకర్షిచేలా చేశాయి. ఆర్జేడీ అభ్యర్థి రేఖా గుప్తా తదితరులతో ప్రశాంత్ కిషోర్ గట్టి పోటీ ఇస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లోని దతియా అసెంబ్లీ స్థానంలో బీజేపీ లీడ్ లో ఉంది. ఇక్కడ మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి అశుతోష్ తివారీకి, కాంగ్రెస్ అభ్యర్థి ఘన్‌శ్యామ్ సింగ్‌కు మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. అయితే ఈ స్థానం గతంలో మాజీ రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రాకు కంచుకోటగా పేరుంది. ఆయన 2008 నుంచి 2018 వరకు వరుసగా మూడుసార్లు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు.
Also Read : మోదీ సంచలనం.. ఒడిశా సీఎంగా ధర్మేంద్ర ప్రధాన్?









