SBI : నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద 1,538 జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి SBI క్లర్క్ 2026 నోటిఫికేషన్‌ రిలీజ్ చేసింది. మొత్తం 1,538 పోస్టులకు గానూ ఆగస్టు 7వ తేదీ నుంచి దరఖాస్తులు తీసుకుంటారు. ఆగస్టు 27వ తేదీ వరక అంటే 21 రోజుల్లో దరఖాస్తు చేసుకోవచ్చు అన్నమాట. అభ్యర్థులు ఏ రాష్ట్రమైనా, కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన వారైనా అప్లై చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ మొత్తం మూడు దశల్లో కొనసాగుతుంది. మొదట ప్రిలిమినరీ పరీక్ష, ఆ తర్వాత మెయిన్స్ పరీక్ష, చివరగా లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ పరీక్షను సెప్టెంబర్ 2026లో, మెయిన్స్ పరీక్షను అక్టోబర్ లేదా నవంబర్ లో జరిగే ఛాన్స్ ఉంది.

ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆన్‌లైన్ పద్ధతిలో 100 మార్కులకు ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో ఉంటుంది. మొత్తం మూడు విభాగాలుగా ఉండే ఈ పరీక్ష సమయం గంట వ్యవధి కలిగి ఉంటుంది. ఇందులో తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కింగ్ విధానం వర్తిస్తుంది, అంటే ప్రతి తప్పు సమాధానానికి నాలుగో వంతు మార్కును కోత విధిస్తారు. అయితే ఈ పరీక్షలో విభాగాలు లేదా మొత్తం పరీక్షకు సంబంధించి మినిమం క్వాలిఫైయింగ్ మార్కులు నిర్ణయించలేదని ఎస్బీఐ స్పష్టం చేసింది. ఇక ఆన్‌లైన్ మెయిన్స్ ఎగ్జామ్ లో మాత్రం సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులకు ఎస్బీఐ నిర్ణయించిన కనీస మార్కులు రావలసి ఉంటుంది.

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అభ్యర్థుల వయస్సు 2026 ఏప్రిల్ 1 నాటికి కనీసం 20 సంవత్సరాల నుండి గరిష్టంగా 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే అభ్యర్థులు 1998 ఏప్రిల్ 2, 2006 ఏప్రిల్ 1 మధ్య జన్మించి ఉండాలన్న మాట. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎస్బీఐ కెరీర్స్ వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో తమ రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించవచ్చు. రిక్రూట్‌మెంట్ పూర్తయ్యే వరకు అభ్యర్థులు తమ ఇమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాలి.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.