
-RAVI PRAKASH
Air Turbulence : ఒక్కసారి ఊహించండి.. ఉదయం 6 గంటలు… మీ హాలీడే ముగిసింది… పుకెట్ నుంచి తిరిగి ఇంటికి వస్తున్నారు… విమానంలో లైట్లు డిమ్‌గా వెలుగుతున్నాయి… చాలామంది ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు… కొంతమంది చిన్నారులు… పేరెంట్స్ భుజాలపై హాయిగా నిద్రపోతున్నారు… క్యాబిన్ క్రూ… బ్రేక్‌ఫాస్ట్ సర్వ్ చేయడం పూర్తిచేసింది… అంతా ప్రశాంతంగా ఉంది… అంతలోనే సిచ్యువేషన్ ఒక్కసారిగా మారిపోయింది… ఊహించుకోవడం వద్దు… ముందుగా ఆ విమానంలో నిజంగా ఏం జరిగిందో తెలుసుకుందాం.. క్యాబిన్ క్రూ గట్టిగా అరుస్తోంది… “ఫాస్టెన్ యువర్ సీట్‌బెల్ట్స్… ఇది ఎమర్జెన్సీ… ఎవరూ లేవొద్దు… వెంటనే సీట్‌బెల్ట్ పెట్టుకోండి…” ఎయిర్ హోస్టెస్ భయపడటం లేదు… తన డ్యూటీ తాను చేస్తోంది…. ఎందుకంటే… తనకు తెలిసిన ఒక విషయం… ఆ విమానంలో ఉన్న చాలామంది ప్యాసింజర్స్‌కు తెలియదు… తీవ్రమైన టర్బులెన్స్ సమయంలో… ప్రమాదంలో పడేది… విమానం కాదు… సీట్‌బెల్ట్ పెట్టుకోని పాసింజర్సే…
Also Read : UPI యూజర్లకు బిగ్ షాక్…. ట్రాన్సెక్షన్స్పై ఛార్జీలు.!
ఒక వృద్దురాలుఏ… భయంతో వణికిపోతోంది. ఏడ్చేస్తోంది… ఆ టైమ్‌లో ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు.. అదే సమయంలో… క్యాబిన్ క్రూ ప్రశాంతంగా ఉంది…! చుట్టూ అంత గందరగోళం ఉన్నా… ఏమాత్రం కంగారు పడడం లేదు… కేకలు వేయడం లేదు… పరుగులు తీయడం లేదు… దెబ్బతిన్న కిటికీ లోపలి ప్యానెల్‌ను… చాలా జాగ్రత్తగా చెక్ చేస్తోంది… అది సేఫ్‌గా ఉందో లేదో చూసుకుంటోంది… దెబ్బతిన్న కిటికీ ప్యానెల్స్… ఊడిపోయిన క్యాబిన్ ఫిట్టింగ్స్… విమానం లోపల అంతా అస్తవ్యస్తంగా కనిపిస్తోంది… ఈ సీన్ చూసిన వాళ్లంతా ఒక్కటే అనుకుంటారు… కాసేపట్లో విమానం కూలిపోతుందేమోనని! కానీ…అలా అనుకుంటే మీ ఒపీనియన్ తప్పు. నిజానికి… ఈ విమానం అప్పటికీ సేఫ్‌గానే ఉంది.
ఎయిర్‌క్రాఫ్ట్ సేఫ్‌గా ఢిల్లీలో ల్యాండ్ అయింది… ఆ తర్వాత… గాయపడ్జ ప్యాసింజర్లను… వెంటనే ఆసుపత్రికి తరలించారు… కొంతమందికి… తలకు గాయాలయ్యాయి… మరికొందరు… టర్బులెన్స్ వచ్చినప్పుడు… విమానం పైకప్పుకు… సీట్లకు… ఓవర్‌హెడ్ లగేజ్ బిన్లకు… బలంగా తాకి గాయపడ్డారు… సమాచారం ప్రకారం… కేవలం ఏడాది వయసున్న ఓ చిన్నారి… తీవ్రమైన కుదుపుల వల్ల… తన సీటు నుంచి ఎగిరి చాలా దూరంగా పడిపోయింది. ఆ టైమ్‌లో సిచ్యువేషన్ ఎంత డేంజర్‌గా ఉందో… ఈ ఒక్క విషయం స్పష్టం చేస్తోంది. కానీ… ఇక్కడే… మనకు ఒక బిగ్ క్వశ్చన్ ఎదురవుతుంది… విమానానికి ఏమీ కాకపోయినా… ఇంతమంది ప్రయాణికులు ఎలా గాయపడ్డారు? ఒక విమానం… ఇంత పెద్ద కుదుపులకు గురైన తర్వాత… ఎలా సేఫ్‌గా ల్యాండ్ అయింది? అసలు… టర్బ్యులెన్స్ అంటే ఏమిటి? టర్బ్యులెన్స్ వస్తే… నిజంగానే విమానం కూలిపోయే ప్రమాదం ఉందా? టర్బ్యులెన్స్ వల్ల జరిగే ప్రమాదాలను… ఒక్క సీట్బెల్ట్తోనే… ఎలా తప్పించుకోవచ్చు? అందుకే… సీటు బెల్ట్ పెట్టుకోవాలని ఏవియేషన్ నిపుణులు ఎందుకు చెబుతుంటారు? ఈ రోజు… టర్బ్యులెన్స్ వెనుక ఉన్న సైన్స్‌ను… అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం… ..టర్బ్యులెన్స్ వచ్చినప్పుడు… విమానంలో నిజంగా ఏం జరుగుతుందో… ఎందుకు కుదుపులు వస్తాయో… అప్పుడు మనం ఏం చేయాలో… అన్నీ మీకు క్లియర్‌గా అర్థమవుతాయి…
టర్బ్యులెన్స్ వెనుక ఉన్న సైన్స్‌లోకి వెళ్లే ముందు… ముందు… ఆ విమానంలో అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆగస్టు 4 ఉదయం… పుకెట్ నుంచి… ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం AI2379… అంటే ఎయిర్‌బస్ A320neo మోడల్.. ప్రయాణg మధ్యలో… ఒక్కసారిగా తీవ్రమైన టర్బ్యులెన్స్ ను ఎదుర్కొంది. కొన్ని సెకన్లలోనే… విమానం ఒక్కసారిగా… దాదాపు 300 ఫీట్ల… కిందికి పడిపోయింది. దాంతో… విమానం లోపల ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. అయినప్పటికీ… విమానం సేఫ్‌గా ఢిల్లీలో ల్యాండ్ అయింది. కానీ… 13 మంది ప్రయాణికులు, నలుగురు క్యాబిన్ క్రూ గాయపడ్డారు. ఈ ఘటనపై…డీజీసీఏ ఎంక్వైరీ చేస్తోంది. విమానం… ఒక్కసారిగా 300 అడుగుల కిందకు ఎలా పడిపోయింది? పైలట్లు కంట్రోల్ చేయలేకపోయారా..! ఇంజన్లు పనిచేయలేదా? విమానం కూలిపోయే పరిస్థితి వచ్చిందా? ఈ మూడు ప్రశ్నలకు… సమాధానం ఒక్కటే. నో…! ఎందుకంటే… అది అర్థం కావాలంటే… ముందు ఒక విషయం తెలుసుకోవాలి. మనలో చాలామందికి… విమానం అంటే… ఆకాశంలో ఎగిరే ఒక మెషీన్ అంతే. కానీ… అది పూర్తి నిజం కాదు. విమానం… ఆకాశంలో ప్రయాణించదు. అది… గాలిలో ప్రయాణిస్తుంది. కానీ… ఆ గాలి… మనకు కనిపించదు. అందుకే… అది ఆకాశంలా అనిపిస్తుంది. నిజానికి… ఆ గాలి… ఒక సముద్రంలా ఉంటుంది. ఈ ఒక్క విషయం అర్థమైతే… టర్బ్యులెన్స్ అంటే ఏంటో… ఈజీగా అర్థమైపోతుంది.
ఒక్కసారి ఊహించండి… మీరు… ఒక చిన్న బోట్లో… చెరువు మధ్యలో ఉన్నారు. మొదట… నీరు ప్రశాంతంగా ఉంటుంది. అంతలో… ఒక పెద్ద అల వస్తుంది. బోట్ పైకి లేస్తుంది. మళ్లీ… కిందికి దిగుతుంది. మరో అల వచ్చి… బోట్‌ను గట్టిగా ఢీకొడుతుంది.. అంతే… బోట్ కూడా… ఆ అలతో పాటు ఊగుతుంది. బోట్‌కు ఏం కాలేదు. నీళ్లు కదిలాయి… బోట్ కూడా కదిలింది. ఇప్పుడు… ఆ బోట్ స్థానంలో… ఒక ఎయిర్ క్రాఫ్ట్‌ని ఊహించండి. నీళ్ల స్థానంలో… గాలిని ఊహించండి. భూమికి… 35 వేల అడుగుల ఎత్తులో… ఇదే జరుగుతోంది. ఒక్క తేడా ఏంటంటే… నీళ్లను మనం చూడగలం. గాలిని చూడలేం. కానీ… గాలి కూడా… నీళ్లలాగే కదులుతుంది. పైకి వెళ్తుంది. కిందికి వస్తుంది. వేగంగా ప్రవహిస్తుంది. కొన్నిసార్లు… అలల్లా కదులుతుంది. ఒక విమానం… ఇలాంటి గాలిలోనే ప్రయాణిస్తుంది. ఎక్కువసార్లు… ఆ గాలి ప్రశాంతంగానే ఉంటుంది. కానీ… కొన్నిసార్లు… ఆ గాలి ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారుతుంది. అప్పుడు… విమానం కూడా… ఆ గాలి కదలికతో పాటు… ఊగుతుంది. మనకు… అదే టర్బ్యులెన్స్గా అనిపిస్తుంది. కానీ… ఆ గాలి ఒక్కసారిగా… ఎందుకు అలా మారుతుంది? ఆ కనిపించని గాలి అలలు… అసలు ఎలా ఏర్పడతాయి? అదే… ఇప్పుడు తెలుసుకుందాం.
ఇప్పుడు… మీరు కూడా… ఆ కనిపించని గాలి సముద్రంలో ప్రయాణిస్తున్నారని ఊహించండి. మొదట… అంతా ప్రశాంతంగానే ఉంటుంది. విమానం చాలా సాఫీగా వెళ్తూ ఉంటుంది. కానీ… ఒక్కసారిగా… విమానం కుదుపులకు గురవుతుంది. అసలు ఈ గాలి అలలు ఎందుకు వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? దీనికి కారణం ఒక్కటే అని చెప్పలేం! చాలా కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యమైన వాటిని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పాయింట్…జెట్ స్ట్రీమ్… ఆకాశంలో వేగంగా ప్రవహించే గాలి నది. ఒక్కసారి… మీరు ఒక నది ఒడ్డున ఉన్నారని ఊహించండి. నది మధ్యలో… నీరు చాలా వేగంగా ప్రవహిస్తుంది. కానీ… ఒడ్డుకు దగ్గరగా వస్తే… అదే నీటి వేగం తగ్గిపోతుంది. ఇప్పుడు… ఈ రెండు వేగాల మధ్యలో… ఒక బోట్ ప్రయాణిస్తే… ఏం జరుగుతుంది? బోట్ షేక్ అవుతుంది. ఆకాశంలో కూడా… దాదాపు ఇలాగే జరుగు తుంది. భూమికి సుమారు 35 వేల అడుగుల ఎత్తులో… చాలా వేగంగా కదిలే గాలి ప్రవాహాలు ఉంటాయి. వాటినే… జెట్ స్ట్రీమ్స్ అంటారు. ఈ గాలి ప్రవాహాలు… గంటకు 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో కదులుతాయి. నిజానికి… విమానాలు ఈ జెట్ స్ట్రీమ్‌లను ఎక్కువగా యూజ్ చేస్తాయి. ఎందుకంటే… వీటి వల్ల ఇంధనం ఆదా అవుతుంది. ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. కానీ… అసలు సమస్య… జెట్ స్ట్రీమ్ మధ్యలో ఉండదు. దాని అంచుల దగ్గర ఉంటుంది. ఒకవైపు… గాలి చాలా వేగంగా కదులుతుంది. మరోవైపు… అదే గాలి తక్కువ వేగంతో కదులుతుంది. ఈ వేగం తేడా వల్ల… గాలి ప్రవాహం ఒక్కసారిగా మారుతుంది. దీన్నే… విండ్ షియర్ అంటారు. ఒక బెడ్‌షీట్‌ను… ఇద్దరు వ్యక్తులు… రెండు వైపుల నుంచి లాగుతున్నారని అనుకుందాం! మొదట… అది సాఫీగా ఉంటుంది. కానీ… లాగడం ఎక్కువైతే… బెడ్‌షీట్ మడతలు పడుతుంది. గాలి కూడా… ఇలాగే మారుతుంది. గాలి వేగంలో తేడాలు వచ్చినప్పుడు. సాఫీగా ఉన్న గాలి ప్రవాహం… అల్లకల్లోలంగా మారుతుంది. అప్పుడు… మనకు కనిపించని గాలి అలలు… ఏర్పడతాయి. ఇదే… క్లియర్ ఎయిర్ టర్బ్యులెన్స్. పైలట్లు కూడా దీన్ని ఊహించలేరు.
ఇక పాయింట్ నంబర్ -2! టర్బ్యులెన్స్ ఎందుకు ప్రమాదకరం? ఇప్పుడు… ఒక విషయం తెలుసుకుంటే… మీరు ఆశ్చర్యపోతారు. చాలా ప్రమాదకరమైన టర్బ్యులెన్స్… చాలాసార్లు… ఆకాశం చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడే వస్తుంది. మేఘాలు ఉండవు. వర్షం ఉండదు. పిడుగులూ ఉండవు. అంతా ప్రశాంతంగానే కనిపిస్తుంది. మరి.. పైలట్లు దీన్ని ముందే ఎందుకు గుర్తించలేరు? ఎందుకంటే… విమానంలోని వెదర్ రాడార్… గాలిని నేరుగా చూడలేదు. అది… తిరిగి వచ్చే సంకేతాల ఆధారంగా పని చేస్తుంది. ఉదాహరణకు… వర్షం… వాటర్ డ్రాప్స్….. పెద్ద మేఘాలు… వీటిని రాడార్ సులభంగా గుర్తిస్తుంది. కానీ… పొడి గాలిలో… అలాంటి సంకేతాలు ఉండవు. అందుకే… రాడార్ స్క్రీన్‌పై… అంతా ప్రశాంతంగానే కనిపిస్తుంది. కానీ… కొన్ని క్షణాల్లోనే… విమానం టర్బులెన్స్లోకి వెళ్లొచ్చు. అందుకే… దీనిని… క్లియర్ ఎయిర్ టర్బులెన్స్ అంటారు. అది బలమైనదని కాదు… కనిపించకుండా వస్తుంది. అందుకే… పైలట్లు… రాడార్ ను మాత్రమే నమ్మరు. వాతావరణ సమాచారం చూస్తారు. అదే దారిలో… ముందుగా వెళ్లిన విమానాల నుంచి… వచ్చిన సమాచారాన్ని కూడా చూస్తారు. అన్నీ తెలుసుకున్న తర్వాతే… ఏం చేయాలనేది నిర్ణయిస్తారు. కానీ… ఇక్కడే… ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ఇంత తీవ్రంగా కుదుపులు వచ్చినా… విమానానికి ఏమీ కాకుండా… దాన్ని ఎలా తయారు చేస్తారు? మరి… ప్రయాణికులు మాత్రం… ఎందుకు సీట్ల నుంచి పైకి ఎగిరిపోతారు? ఎందుకు… విమానం పైకప్పుకు బలంగా తాకుతారు? అసలు… ఆ సమయంలో… విమానం లోపల ఏం జరుగుతోంది? దాని వెనుక ఉన్న సైన్స్ ఏంటి? అదే… ఇప్పుడు తెలుసుకుందాం.
విమానం సేఫ్ అయితే ప్రయాణీకులు ఎందుకు గాయపడుతున్నారు? ఇప్పుడు మనం ఈ మొత్తం కథలోని అత్యంత పెద్ద మిస్టరీ దగ్గరికి వచ్చాం. ఆధునిక ఎయిర్ క్రాఫ్ట్‌లు టర్బ్యులెన్స్లో కూడా సురక్షితంగా ఎగరడానికి డిజైన్ చేశారు. అయితే… ప్యాసింజర్లు ఎందుకు గాయపడుతున్నారు? కొన్ని సందర్భాల్లో… వాళ్లు సీలింగ్‌కు ఎందుకు తాకుతున్నారు? ఇది అర్థం చేసుకోవాలంటే… ఒక్కసారి విమానంగురించి మర్చిపోండి. ప్రతిరోజూ మన జీవితంలో జరిగే ఒక సాధారణ విషయాన్ని అర్థం చేసుకుందాం. మీరు ఒక లిఫ్ట్ లో నిలబడి ఉన్నారని ఊహించండి. అకస్మాత్తుగా… ఆ లిఫ్ట్ చాలా వేగంగా కిందికి కదలడం ప్రారంభించింది. ఒక క్షణంలో… మీ శరీరం తేలికగా అనిపిస్తుంది. ఇప్పుడు ఊహించండి… ఆ లిఫ్ట్ఇంకా వేగంగా కిందికి పడిపోతుంది. మీ కాళ్లు నేలతో కాంటాక్టును కోల్పోవడం ప్రారంభిస్తాయి. కొన్ని క్షణాల పాటు… మీరు గాల్లో తేలుతున్నట్టుగా అనిపిస్తుంది. తీవ్రమైన టర్బ్యులెన్స్ సమయంలో విమానంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది. ఇప్పుడు మళ్లీ ఎయిరిండియా ఇన్సిడెంట్ దగ్గరకు వెళ్దాం.
Also Read : మరోసారి పార్లమెంట్ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు!
విమానం కేవలం కొన్ని సెకన్లలోనే దాదాపు 300 ఫీట్లకుకిందికి పడిపోయింది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే… ఆ విమానం తన ప్యాసింజర్లను వెనక్కి వదిలేయలేదు. విమానం కదిలింది… దాని లోపల ఉన్న ప్రతి వస్తువు ఫిజిక్స్ లా , INERTIA ప్రకారం తాము కదులుతున్న దిశలోనే కదలాలని ప్రయత్నించాయి. మీరు సీటు బెల్ట్ ధరించి ఉంటేమీ శరీరం కూడా విమానంతో పాటు కదులుతుంది. మీకు ఒక బలమైన కుదుపు వస్తుంది. మీరు భయపడి ఉండొచ్చు. కానీ… మీరు మీ సీట్లోనేసురక్షితంగా ఉంటారు.
ఇప్పుడు ఇంకో ప్యాసింజర్‌ను గురించి ఊహించుకోండి. ఇప్పుడే సీటు బెల్ట్ తీసేసిన వ్యక్తి. లేదా వాష్‌రూమ్ వైపు నడుస్తున్న వ్యక్తి. లేదా సీటుపైనిలబడి ఉన్న ఒక చిన్నపిల్ల. లేదా ఓవర్‌హెడ్ బిన్ తెరుస్తున్న ఒకప్రయాణీకుడు వారి శరీరాన్ని ఎయిర్ క్రాఫ్ట్ కు బిగించి ఉంచేది ఏదీ లేదు. విమానం ఒక్కసారిగా కిందికి కదిలినప్పుడు… వారి శరీరం వెంటనే దానిని అనుసరించదు. ఒక క్షణం పాటు… వారి శరీరం తాము మొదట కదులుతున్న దిశలోనే కొనసాగుతుంది. క్యాబిన్ లోపల నుంచి చూస్తే… ఆ ప్రయాణీకుడు
పైకి ఎగిరినట్టుగా కనిపిస్తారు.కానీ… నిజానికి అలా జరగలేదు.విమానంకిందికి కదిలింది… అయితే ఆ ప్యాసింజర్ మాత్రంమాత్రం దాదాపు తాను ఉన్న చోటే అలాగే కదులుతూ ఉన్నాడు. తర్వాత… ఒక క్షణం గడిచిన తర్వాత… విమానం మళ్లీ పైకి వస్తుంది. అప్పుడే… గాయాలు అవుతాయి.సీలింగ్, ఆర్మ్ రెస్ట్, సీట్ ఫ్రేమ్, ఓవర్‌హెడ్ కంపార్ట్మెంట్, సర్వీస్ ట్రాలీ… ఇవన్నీ ఒక్కసారిగా హర్డ్ హిట్టింగ్ అబ్జెక్ట్ గా మారిపోతాయి.
అందుకే… చాలామంది ప్రయాణీకులు ముందు సీలింగ్‌కు బలంగా తగిలి మళ్లీ సీట్స్‌పై పడిపోతారు. అందుకే… ఓవర్ హెడ్ బిన్స్‌లో బ్యాగేజీ కిందపడిపోయింది.అందుకే… ఒక సంవత్సరం వయసున్న చిన్నారి అనేక వరుసల దూరం వరకు ఎగిరిందని సమాచారం వచ్చింది. క్యాబిన్ క్రూ కే టర్బ్యులెన్స్ సమయంలో అత్యధిక గాయాలు అవుతుంటాయి. వాళ్లు కేర్లెస్గా ఉండడం వల్ల కాదు.
వారి ఉద్యోగం కారణంగా… అందరూ కూర్చుని ఉన్నప్పుడు… వాళ్లు మాత్రం నిలబడి పనిచేయాల్సి రావడం వల్ల. ఇది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. టర్బ్యులెన్స్ సమయంలో విమానానికి ఎటువంటి ప్రమాదం కాదు. కానీ, ఫ్లైట్‌లో స్వేచ్ఛగా కదులుతున్న మనుషులకే ఎక్కువ నష్టం జరుగుతుంది. ఇప్పుడు దీనితో మరో ఆసక్తికరమైన ప్రశ్న వస్తుంది. బాగా సివియర్ టర్బ్యులెన్స్ వస్తే అది ఒక మోడర్న్ ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్‌ను కూల్చగలదా అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం.
టర్బులెన్స్ వల్ల విమానం క్రాష్ అవుతుందా? ఈ నిజం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పుడు దాదాపు ప్రతి ఎయిర్ ట్రావెలర్‌ను భయపెట్టే ప్రశ్న దగ్గరకు వచ్చాం. టర్బ్యులెన్స్ నిజంగా ఒక ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్‌ను కూల్చివేయగలదా…? దానికి సమాధానం… కూల్చలేదు.. నిజానికి… ఆధునిక కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ను టర్బ్యులెన్స్లను దృష్టిలో పెట్టుకునే డిజైన్ చేస్తారు. ప్రతి విమానం తన జీవితకాలంలో వేలసార్లు టర్బ్యులెన్స్లను ఎదుర్కొంటుందని ఇంజనీర్స్కు ముందే తెలుసు.అందుకే వారు విమానాలను స్మూత్ స్కైస్ కోసం నిర్మించరు. రఫ్ స్కైస్ కోసం డిజైన్ చేస్తారు. ఒక్కసారి విమానం రెక్కను గమనించండి. రెక్క పూర్తిగా గట్టిగా, కదలకుండా ఉండాలని అనుకుంటారు. కానీ అది నిజానికి ఒక అపోహ. ఫ్లైట్ రెక్కలు వంగేలా డిజైన్ చేస్తారు.
ఎలా అంటే… భూకంపం వచ్చినప్పుడు ఒక ఎత్తైన భవనం కొద్దిగా ఊగేలా డిజైన్ చేసినట్లే… విమానం రెక్కలు కూడా టర్బ్యులెన్స్ సమయంలో కూడా ఫ్లెక్స్ అయ్యేలా తయారు చేస్తారు. ఈ ఫ్లెక్సీబులిటీ వల్ల భారీ స్థాయిలో వచ్చే ఫోర్స్‌ను కూడా రెక్కలు తట్టుకుంటాయి. నిజానికి… ఎయిర్ క్రాఫ్ట్ సర్టిఫికేషన్ సమయంలో , తయారీ సమయంలో సాధారణ ఫ్లైట్ ఆపరేషన్స్ లో ఎదురయ్యే ఫోర్సెస్ కంటే చాలా ఎక్కువ ఫోర్స్‌తోనే రెక్కలను పరీక్షిస్తారు. ఆ సమయంలో రెక్కలువంగిపోతాయి… కొన్ని మీటర్ల పైకి వంగిపోతాయి. అయినా విరిగిపోవు. టర్బ్యులెన్స్ సమయంలో మీరు కిటీకీ బయట చూస్తే విమానం రెక్కలు కదులుతున్నట్టు కనిపిస్తే… భయపడకండి. అలా కనిపిస్తే విమానం సరిగ్గా ఇంజనీర్లు తయారు చేసిన విధంగానే పనిచేస్తోందని అర్థం.ఇక పుకెట్ నుంచి ఢిల్లీకి తిరిగి వస్తున్న విమానం విషయం గురించి చూద్దాం… టర్బ్యులెన్స్ సమయంలో ప్యాసింజర్లు చాలా భయపడ్డారు. క్యాబిన్ మొత్తం గందరగోళంగా మారింది. పైలెట్స్ మాత్రం విమానం కూలిపోతోందని లేదా విరిగిపోతోందని ప్రకటించలేదు. అందరూ తమ సీట్లలో కూర్చుని సీట్ బెల్ట్ ధరించాలని క్యాబిన్ క్రూ మాత్రం మళ్లీ మళ్లీ సూచించారు. ఎందుకు? ఎందుకంటే వారికి చాలా మంది ప్యాసింజర్లకు తెలియని ఒక విషయం తెలుసు.
ఆ విమానం టర్బ్యులెన్స్ను తట్టుకునేలా తయారైంది. అసలు ప్రమాదం విమానంబయట కాదు…క్యాబిన్ లోపలేఉంది. ఇంకో విషయం చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది. ఏవియేషన్ సేఫ్టీ స్టడీస్ ప్రకారం టర్బ్యులెన్స్కు సంబంధించిన చాలా గాయాలు విమానం డ్యామేజీ వల్ల కాదు.. సీటు బెల్ట్ ధరించకపోవడం వల్లే జరుగుతాయి. క్యాబిన్ క్రూ కు టర్బ్యుటెన్స్ గాయాలు ఎక్కువగా జరుగుతాయి. దానికి కారణం విమానాలు సురక్షితం కాకపోవడం కాదు… వారి జాబ్ ప్రకారం వారు నిలబడి ప్రయాణీకులకు సర్వీస్ ఇస్తూ ఉండాలి. అదే సమయంలో ఊహించని విధంగా టర్బ్యులెన్స్ వస్తే వారికి గాయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే పైలెట్స్ మళ్లీ మళ్లీ ఒకే సింపుల్ అనౌన్స్మెంట్ చేస్తుంటారు.
“దయచేసి మీరు మీ Seatలో కూర్చుని ఉన్నంతసేపూ సీటు బెల్ట్ తప్పకుండా ధరించి ఉండండి.” కానీ చాలా మంది ప్యాసింజర్లు ఆ సూచనను పట్టించుకోరు. కొంతమంది సీటు బెల్ట్‌ను లూజ్ చేస్తారు.మరికొందరు పూర్తిగా తీసేస్తారు. కొంతమంది వాష్ రూమ్‌కు వెళ్లేందుకు లేచి నిలబడతారు. ఇంకొందరు ఓవర్‌హెడ్ బిన్స్ తెరవడం మొదలుపెడతారు. చాలా సందర్భాల్లో… ఏమీ జరగదు. కానీ… ఒకరోజు ఎలాంటి వార్నింగ్ లేకుండా తీవ్రమైన టర్బ్యులెన్స్ వచ్చినప్పుడు… ఆ కొద్ది సెకన్లు అన్ని మార్చేయగలవు. ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్న. టర్బ్యులెన్స్ నిజంగానే ఇప్పుడు ఎక్కువ అవుతోందా? లేక మనం దాని గురించి ఇప్పుడు ఎక్కువగా వింటున్నామా?
మీ ఫ్లైట్ అకస్మాత్తుగా టర్బ్యులెన్స్లోకి వెళ్తే… మీరు ఏమి చేయాలి? ఇప్పుడు టర్బ్యులెన్స్అంటే నిజంగా ఏమిటో మనం అర్థం చేసుకున్నాం… ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. మీరు ఏమి చేయాలి? ఎందుకంటే నిజం ఏమిటంటే… టర్బ్యులెన్స్ను మనలో ఎవ్వరూ కంట్రోల్ చేయరు.కానీ… దాని వల్ల గాయపడే అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా తగ్గించవచ్చు. మొదటి నియమం… అదే సమయంలో అత్యంత సులభమైన నియమం కూడా. మీరు సీట్లోకూర్చుని ఉన్నప్పుడల్లా… మీ సీటు బెల్ట్ నుతప్పకుండా Fasten చేసి ఉంచండి. జాగ్రత్తగా గమనించండి… “Seat Belt Sign ONలో ఉన్నప్పుడు మాత్రమే Seat Belt పెట్టుకోండి” అని చెప్పడం లేదు.నేను చెప్పింది… “మీరు సీట్లోకూర్చున్నప్పుడల్లా.” మీకు ఇష్టమైతే… దాన్ని కొంచెం లూజ్‌గా పెట్టుకోవచ్చు. మీకు అది ఉన్నట్టు కూడా అనిపించదు. కానీ…వార్నింగ్ లేకుండా తీవ్రమైన టర్బ్యులెన్స్ ఆ ఒక్క అలవాటు… తీవ్రమైన ప్రమాదాన్ని నివారించగలదు. రెండవ విషయం… అత్యవసరమైతే తప్ప… లేచి నిలబడకుండా ఉండండి. మీరు వాష్రూమ్కువెళ్లాల్సి వస్తే… చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా… విమానం టేకాఫ్‌నకు ముందే వాష్రూమ్్కు వెళ్లేప్రయత్నం చేయండి. ఎందుకంటే..Clear-Air Turbulence ఏ క్షణంలో వస్తుందో… ఏ పైలెట్ కూడాకచ్చితంగా ఊహించడు.మూడవ విషయం… ఓవర్‌హెడ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ సామాన్లు కుక్కి బలవంతంగా ఓవర్ప్యాక్డ్ ఓవర్ హెడ్బిన్ను మూసివేసేందుకు ప్రయత్నించకండి. అలాగే… టర్బ్యులెన్స్జరిగిన వెంటనే… తొందరపడి ఓవర్‌హెడ్ బిన్ను వెంటనే తెరవకండి. ఎందుకంటే… అందులో ఉన్న బ్యాగ్స్ కింద పడి… తీవ్రమైన గాయాలకు కారణమవుతాయి. మీరు పిల్లలతోప్రయాణిస్తుంటే… వీలైనప్పుడల్లా… వారిని జాగ్రత్తగా చూస్తుండాలి. ఎందుకంటే… అకస్మాత్తుగా వచ్చే టర్బ్యులెన్స్
సమయంలో… చిన్నపిల్లలు తమని తాము రక్షించుకోలేరు. ఇంకో చిన్న రిక్వెస్ట్… క్యాబిన్ క్రూ చెప్పే సూచనలను తప్పకుండా వినండి. వాళ్లు… “దయచేసి మీ సీట్లోకి తిరిగి వెళ్లండిఅని చెప్పినప్పుడు… మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. మిమ్మల్ని కాపాడాలని చెబుతున్నారు. ఎందుకంటే… సంవత్సరాల ట్రైనింగ్ వాళ్లకు ఒక విషయం నేర్పింది. టర్బ్యులెన్స్ తలుపు తట్టి రాదు. చివరిగా… మీకు ఒక ఆలోచన షేర చేసుకోవాలనుకుంటున్నాను. నెక్స్ట్ టైమ్ మీరు ప్రయాణీస్తున్న విమానం కుదుపులకు గురవడం మొదలుపెడితే… వెంటనే… ఫ్లైట్ కింద పడిపోతోంది.” అని అనుకోకండి. దాని బదులుగా… ఈ విషయాలను గుర్తు చేసుకోండి. సముద్రంలో అలలపై ఒక బోటుఎలా ప్రయాణిస్తుందో… అదే విధంగా… ఈ ఎయిర్ క్రాఫ్ట్ కూడా… ఆకాశంలో కనిపించని అలలపై ప్రయాణిస్తోంది. అలా ప్రయాణించడానికి… ఈ విమానాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. అసలు ప్రశ్న ఏమిటంటే… ప్యాసింజర్స్‌గా మనం సిద్ధంగా ఉన్నామా? లేదా? కొన్నిసార్లు… సురక్షితంగా బయటపడటం… లేదా ఆసుపత్రుల్లో చేరడం… ఈ రెండింటి మధ్య తేడా… కేవలం… రెండు సెకన్లలో Fasten చేసిన ఒక Seat Belt మాత్రమే. Safe Flying.









