Commonwealth Games 2026 : భారత స్టార్ బాక్సర్ ప్రీతి పవార్ గ్లాస్గో వేదికగా జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో భారత్ కు తొలి స్వర్ణ పతకాన్ని అందించారు. ఫైనల్ పోరులో కెనడాకు చెందిన స్కార్లెట్ సవానాపై సర్వసమ్మత నిర్ణయంతో విజయం సాధించి పసిడి గెలుచుకున్నారు.

పోటీ ప్రారంభం నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన 22 ఏళ్ల ప్రీతి పవార్.. తన అద్భుతమైన పంంచ్‌లు, చురుకైన కదలికలతో ప్రత్యర్థికి ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. ఈ టోర్నమెంట్ అంతటా ఏ ఒక్క బౌటులోనూ ఓడిపోకుండా అజేయంగా ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆమె, తుది పోరులోనూ అదే జోరును కొనసాగించి తన ప్రత్యర్థిపై స్పష్టమైన ఆధిక్యంతో విజయదుందుభి మోగించారు.

అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రపంచ 3వ రంక్ బాక్సర్ ప్రీతి పవార్, ఈ స్వర్ణ పతకంతో తన విజయాల పరంపరను మరింత ఘనంగా చాటుకున్నారు.

Also Read : కుల్గాంలో ఇటుక బట్టీ కార్మికులపై ఉగ్రదాడి.. ఒకరు మృతి

Also Read : మైక్రోసాఫ్ట్‌ సరికొత్త చరిత్ర.. ఒక్కరోజే రూ.42 లక్షల కోట్లు పెరిగిన మార్కెట్ విలువ

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.