
India vs Pakistan : మహిళల ఆసియా కప్ పూర్తి షెడ్యూల్ వచ్చేసింది. ఇందులో భాగంగా ఇండియా, పాకిస్తాన్ జట్లు మరోసారి తలపడనున్నాయి. సెప్టెంబర్ 5న దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో తలపడనున్నాయి. గ్రూప్ Aలో భారత్, పాకిస్తాన్‌లతో పాటుగా థాయిలాండ్, హాంగ్ కాంగ్ చైనా జట్లు ఉంటాయి. గ్రూప్ Bలో శ్రీలంక, బంగ్లాదేశ్, యూఏఈ, ఇండోనేషియాలు ఉంటాయి. ఆగస్టు 28న థాయిలాండ్, హాంగ్ కాంగ్ చైనాల మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. టీ20ఐ ఫార్మాట్‌లో జరగనున్న ఈ టోర్నమెంట్‌కు ఇది ఆరవ ఎడిషన్.
ఇక ఇండియా తన మొదటి మ్యాచ్ ఆగస్టు 30వ తేదీన థాయిలాండ్‌తో జరుగుతుంది. అన్ని మ్యాచ్‌లు స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు మొదలువుతాయి. సెమీ-ఫైనల్స్ సెప్టెంబర్ 10, 11 తేదీలలో జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 13వ తేదీన జరగనుంది.
ఆగస్టు 28: థాయ్‌లాండ్ వర్సెస్ హాంగ్‌కాంగ్, చైనా
ఆగస్టు 29 : శ్రీలంక vs యూఏఈ
ఆగస్టు 30: భారత్ vs థాయిలాండ్
ఆగస్టు 31: బంగ్లాదేశ్ వర్సెస్ ఇండోనేషియా
సెప్టెంబర్ 1 : పాకిస్థాన్ vs థాయిలాండ్
సెప్టెంబర్ 2: శ్రీలంక vs ఇండోనేషియా
సెప్టెంబర్ 3: భారత్ వర్సెస్ హాంకాంగ్, చైనా
సెప్టెంబర్ 4: యూఏఈ వర్సెస్ ఇండోనేషియా
సెప్టెంబర్ 5: భారత్ వర్సెస్ పాకిస్తాన్
సెప్టెంబర్ 6: శ్రీలంక vs బంగ్లాదేశ్
సెప్టెంబర్ 7: పాకిస్థాన్ వర్సెస్ హాంకాంగ్, చైనా
సెప్టెంబర్ 8: బంగ్లాదేశ్ vs యూఏఈ
సెప్టెంబర్ 10 : సెమీ-ఫైనల్ 1
సెప్టెంబర్ 11: సెమీ-ఫైనల్ 2
సెప్టెంబర్ 13 : ఫైనల్
ఈ ఏడాది జరిగే మహిళల ఆసియా కప్‌లో భారత్ తమ 8వ టైటిల్‌పై కన్నేసింది. పాకిస్తాన్ విషయానికొస్తే ఇప్పటివరకు ఆ జట్టు టైటిల్‌ను గెలుచుకోలేదు. 2012, 2016లలో ఫైనల్‌లో భారత్ చేతిలో ఓడిపోయింది. ఇక పాకిస్థాన్ 2022లో కేవలం ఒక్కసారి మాత్రమే భారత్‌ను ఓడించింది.









