Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా వారి ఎమ్మెల్సీ సభ్యత్వం రద్దు చేయాలని శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం దాన్ని ఆమోదించింది. అనంతరం తీర్మానాన్ని మండలికి పంపించింది.

Also Read : కేసీఆర్‌ ఇంటి వద్ద హైటెన్షన్‌.. కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ కార్యకర్తల రాళ్ల దాడి!

మండలిలో వారిని వెంటనే సస్పెండ్‌ చేయాలని మంత్రి శ్రీధర్‌బాబు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చ సందర్భంగా తాతా మధు, నవీన్‌ రెడ్డిలు సభకు రావడాన్ని పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం తాతామధు, నవీన్‌ రెడ్డిలను సస్పెన్స్‌ చేస్తూ మండలి తీర్మానించింది. వారిని ఈ సెషన్‌ మొత్తం సస్పెండ్‌ చేస్తూ మండలి నిర్ణయం తీసుకుంది. అనంతరం శాసనమండలిని రేపటికి వాయిదా వేస్తూ మండలి చైర్మన్‌ నిర్ణయం తీసుకున్నారు. కాగా, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల సస్పెన్సన్‌ను వ్యతిరేకిస్తూ మిగిలిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు మండలిలో ఆందోళనకు దిగారు. దీంతో మండలిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్సీలు చైర్మన్‌ పోడియంను చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Also Read : అసెంబ్లీకి వెళ్లే ప్రజాప్రతినిధులను అడ్డుకోవడానికి వీల్లేదు.. హైకోర్టు సంచలన ఆదేశాలు

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.