
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను చంపేందుకు ఇరాన్ పక్కా ప్లాన్ తో అడుగులు వేసిందనే వార్తలు ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి. అయితే అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే.. ట్రంప్ టర్కీ పర్యటనలో ఉన్న సమయంలో ట్రంప్ ఏ హోటల్‌లో ఉన్నాడు.. అందులో ఏ అంతస్తులోని ఏ గదిలో బస చేశారనే అత్యంత రహస్య సమాచారం కూడా ఇరాన్ చేతికి చిక్కింది. జులై 8న టర్కీ రాజధాని అంకారాలో నాటో సమిట్ చివరి రోజున ఈ కుట్ర వెలుగు చూసింది.
నాటో సదస్సు జరిగిన ప్రాంతానికి అత్యంత సమీపంలో భుజంపై పెట్టుకుని ప్రయోగించే క్షిపణి తో ఓ వ్యక్తి సంచరిస్తున్నట్లు అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయి. ట్రంప్ ఎక్కే ఎయిర్ ఫోర్స్ వన్ విమానం గాల్లోకి టేకాఫ్ గానీ, ల్యాండింగ్ గానీ రాకెట్లతో దాడి చేసి దాన్ని పేల్చేయాలని ఇరాన్ ప్లాన్ చేసినట్లు అధికారులు పక్కా ఆధారాలు సంపాదించారు.
కేవలం విమానంపైనే కాదు, టర్కీలో ట్రంప్ బస చేసిన భవనం, ఆయన ఉన్న రూమ్ నంబర్, ఆ గది ఉన్న ఫ్లోర్ వివరాలన్నీ ఇరాన్ ఏజెంట్లకు ముందే తెలుసునని అమెరికా నిఘా సంస్థలు గుర్తించాయి. ఈ స్థాయిలో అధ్యక్షుడు బస చేసే రహస్య సమాచారం లీక్ అవ్వడం అమెరికా రక్షణ చరిత్రలోనే సీక్రెట్ సర్వీస్‌ను వణికించిన అతిపెద్ద వైఫల్యంగా మారింది.
Also Read : ఇస్లామిక్ నాటో ఒప్పందంలో ఏముంది? పాక్ ఏం చేయబోతుంది?
ఈ బెదిరింపు అత్యంత ప్రామాణికమైనదని గ్రహించిన సీక్రెట్ సర్వీస్ అధికారులు, సైన్యం వెంటనే బురిడీ కొట్టించే వ్యూహన్ని కూడా అమలు చేశాయి. అదేంటంటే అంకారా విమానాశ్రయంలో అందరూ చూస్తుండగా, మీడియా కెమెరాల ముందే ట్రంప్ అసలు ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలోకి ఎక్కారు. విమానం ఎక్కిన కొన్ని నిమిషాలకే, ఎవరికీ అనుమానం రాకుండా విమానానికి భోజనం సరఫరా చేసే ఒక క్యాటరింగ్ ట్రక్కు లో ట్రంప్‌ను గుట్టుచప్పుడు కాకుండా కిందకి దించారు. అక్కడి నుంచి ఆయనను ఆర్మీకి చెందిన C-32A అనే చిన్న విమానంలోకి మార్చి, రహస్యంగా బ్రిటన్ దాటించి అమెరికాకు చేర్చారు. విమానంలో ఉన్న జర్నలిస్టులు, సిబ్బంది కిటికీల తెరలు దించి ఉంచడంతో, ట్రంప్ తమతోనే ఉన్నారని భ్రమపడి ఆ ప్రమాదకర విమానంలోనే ప్రయాణించారు. అయితే, బ్రిటన్ చేరుకున్నాక ట్రంప్‌ను మళ్లీ అసలు విమానంలోకి ఎలా మార్చారనేది మాత్రం బయటకు రాలేదు.
అమెరికా అధ్యక్షుడి రక్షణ కోసం ఇలాంటి రహస్య విమానాన్ని వాడటం ఇది మొదటిసారేం కాదు. 2000 సంవత్సరంలో నాటి ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ పాకిస్థాన్ పర్యటన ముగించుకుని తిరిగొచ్చేటప్పుడు కూడా ఇలాంటి సీక్రెట్ విమానాన్నే వాడారు.
ఇరాన్ వద్ద అమెరికా వరకు వచ్చేంత సుదూర ప్రాంత క్షిపణులు లేవు. కానీ అమెరికా భూభాగంలోకి చొరబడిన ఇరాన్ స్లీపర్ సెల్స్ గానీ, లేదా డ్రోన్లు, చిన్నపాటి విమానాల ద్వారా దాడి జరగొచ్చనే భయంతో సీక్రెట్ సర్వీస్ అలర్ట్ అయ్యింది. ఇటీవల న్యూజెర్సీలోని బెడ్‌మినిస్టర్ గోల్ఫ్ క్లబ్ లో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా, ఆయన వెనుక ఎవెంచర్ షార్ట్-రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, సెంటినెల్ ఎయిర్ డిఫెన్స్ రడార్ లను మోహరించారు. చుట్టూ ముళ్ల కంచెలు వేసి, ఎఫ్-16 యుద్ధ విమానాలతో ఆకాశంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.
గతంలో రెండుసార్లు ఎటాక్ జరగగా ట్రంప్ ప్రాణాలతో భయపడగా ఇప్పుడు ఇరాన్ రూపంలో నేరుగా పక్కా రూమ్ నంబర్ తో సహా స్కెచ్ పడటం వైట్ హౌస్, సీక్రెట్ సర్వీస్ రక్షణ విభాగాల్లో నిద్రలేకుండా చేస్తోంది. ప్రస్తుతం ట్రంప్ భద్రతను కూడా పెంచారు. ఆయన గోల్ఫ్ కోర్స్‌లు, నివాసాల వద్ద రాకెట్లను కూల్చేసే యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సైల్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. ఎవరూ లోపలికి రాకుండా చుట్టూ ముళ్ల కంచెలు వేశారు. అనుమతి లేకుండా ఏ విమానం వచ్చినా వెంటనే కూల్చేయడానికి ఎఫ్-16 (F-16) యుద్ధ విమానాలు ఆకాశంలో నిరంతరం పెట్రోలింగ్ చేస్తున్నాయి.
Also Read : ఓడిపోయిన ట్రంప్.. ఇరాన్‌తో యుద్దం క్లోజ్..!









