Iran: ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు సంబంధించి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు వ్యక్తులకు మంగళవారం బహిరంగంగా ఉరిశిక్ష అమలు చేసినట్లు ఆ దేశ న్యాయస్థానం ప్రకటించింది. సెంట్రల్ ఇస్ఫహాన్‌లోని మలెక్‌షహర్ నగరంలోని ఒక ప్రజా చౌక్‌లో, ప్రజల సమక్షంలోనే అబోల్ఫజల్ సెపాహి, అమీర్-హుస్సేన్ సఫారీ అనే ఇద్దరు నిందితులకు ఉరిశిక్ష అమలు చేసినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.

జనవరి 8న జరిగిన నిరసనల సమయంలో ఈ ఇద్దరు వ్యక్తులు పోలీసులపై కత్తులు, కొడవళ్లతో దాడి చేసి, వారిని రోడ్డు సైన్ బోర్డులకు కట్టేసి, ఈడ్చుకెళ్లి, గ్యాసోలిన్ పోసి నిప్పు అంటించారని న్యాయస్థానం నిర్ధారించింది. ఆయుధాలతో దాడికి తెగబడి భయాందోళనలు సృష్టించడం ద్వారా “దేవుడిపై యుద్ధం ప్రకటించడం” (మొహారేబెహ్) , శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగించడం వంటి తీవ్రమైన నేరాల కింద వీరికి ఈ శిక్ష విధించారు.

Also Read : టన్నుల కొద్ది బంగారం కొంటున్న చైనా.. ట్రంప్ కు షాకిచ్చే వ్యూహం ఇదేనా?

గత ఏడాది డిసెంబర్ చివరిలో పెరిగిన జీవన వ్యయానికి వ్యతిరేకంగా ప్రారంభమైన ఈ నిరసనలు, త్వరలోనే ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారి జనవరి 8, 9 తేదీల్లో పరాకాష్టకు చేరాయి. ఈ ఘర్షణల్లో 3,000 మందికి పైగా మరణించగా, అమెరికా, ఇజ్రాయెల్ ప్రోద్బలంతో జరిగిన ఉగ్రవాద చర్యలే ఇందుకు కారణమని ఇరాన్ తెలిపింది. అయితే భద్రతా బలగాలే నిరసనకారులపై కాల్పులు జరిపాయని విదేశీ మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఈ నిరసనల నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సైనిక జోక్యం చేసుకుంటామని హెచ్చరించడం, ఆ తర్వాత ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడిగా ఇరాన్‌పై దాడి చేయడంతో మధ్యప్రాచ్యంలో యుద్ధం మొదలైంది. ఆ సమయం నుండి ఇరాన్‌లో అరెస్టులు, ఉరిశిక్షలు గణనీయంగా పెరిగాయి. అమ్యెస్టీ ఇంటర్నేషనల్ నివేదికల ప్రకారం, ప్రపంచంలో చైనా తర్వాత అత్యధికంగా ఉరిశిక్షలు అమలు చేస్తున్న దేశం ఇరానే.

Also Read : పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పాక్ సైన్యం క్రూరత్వం: కాల్పుల్లో 20 మంది కశ్మీరీల ప్రాణాలు బలి

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.