
Iran-Israel Attack Warning : పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్)లో ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్‌లు తనపై కొత్త దాడులకు తెగబడితే, బదులుగా గల్ఫ్ ప్రాంతంలో ఉన్న ప్రపంచంలోనే అత్యంత కీలకమైన 7 చమురు, సహజ వాయువు (గ్యాస్) కేంద్రాలపై విరుచుకుపడతామని ఇరాన్ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. తమ వద్ద ఉన్న పాయింట్-టార్గెట్ (అత్యంత ఖచ్చితత్వంతో కూడిన) క్షిపణుల పరిధిలో అరబ్ దేశాల ప్రధాన ఇంధన వనరులు ఉన్నాయని టెహ్రాన్ పేర్కొంది.
Also Read : ‘మాపై దాడి చేస్తే 7 అతిపెద్ద ఆయిల్ ఫీల్డ్‌లను ధ్వంసం చేస్తాం’.. ఇరాన్ తీవ్ర హెచ్చరిక
ఇరాన్ హిట్ లిస్ట్‌లో ఉన్న 7 ప్రధాన ఇంధన రంగాలు:
ఇరాన్ సైనిక వర్గాలు , వార్తా సంస్థల నివేదికల ప్రకారం, అరబ్ దేశాలు,ఇజ్రాయెల్‌లోని 7 అతిపెద్ద శక్తి కేంద్రాలను తమ క్షిపణులు నేరుగా లక్ష్యంగా చేసుకోగలవు. ఆ స్థావరాల వివరాలు:
ఘావర్ ఆయిల్ ఫీల్డ్ (సౌదీ అరేబియా): ఇది సౌదీ అరేబియా చమురు ఉత్పత్తికి వెన్నుముక లాంటిది. ఇక్కడ ఉత్పత్తి ఆగిపోతే ప్రపంచ చమురు సరఫరాలో 5 శాతానికి పైగా వెంటనే నిలిచిపోతుంది.
అబ్కైక్ , ఖురైస్ (సౌదీ అరేబియా): రోజుకు 70 లక్షల బారెళ్ల శుద్ధి సామర్థ్యం కలిగిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ స్టెబిలైజేషన్ ప్లాంట్ ఇది.
రువైస్ రిఫైనరీ, జకుమ్ ఆయిల్ ఫీల్డ్ (యుఏఈ): రోజుకు 10 లక్షల బారెళ్లకు పైగా చమురును ఉత్పత్తి చేసే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని రెండవ అతిపెద్ద ఆఫ్‌షోర్ చమురు క్షేత్రం.
నార్త్ గదీర్ గ్యాస్ ఫీల్డ్,రాస్ లఫాన్ ఎల్‌ఎన్‌జి (ఖతార్): ప్రపంచంలోనే అత్యంత పెద్ద గ్యాస్ ఫీల్డ్. ప్రపంచ వ్యాప్తంగా జరిగే ఎల్‌పిజి/ఎల్‌ఎన్‌జి వ్యాపారంలో 20 శాతం వాటా, 25 శాతం గ్యాస్ నిల్వలు దీని సొంతం.
బర్గన్ ఆయిల్ ఫీల్డ్ (కువైట్): 67 బిలియన్ బారెళ్ల భారీ నిల్వలు కలిగి, రోజుకు 20 లక్షల బారెళ్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న కీలక కేంద్రం.
సిత్రా రిఫైనరీ, అల్-మిహాజ్ (బహ్రెయిన్): బహ్రెయిన్‌కు చెందిన ప్రధాన రిఫైనరీ ,వ్యూహాత్మక స్థావరం.
లెవియాథన్, తమార్ గ్యాస్ ఫీల్డ్స్ (ఇజ్రాయెల్): ఇజ్రాయెల్‌లోని అత్యంత భారీ సహజ వాయువు క్షేత్రాలు.
Also Read : సముద్ర మార్గ వ్యాపార రక్షణ కోసం.. 14 దేశాలతో సౌదీ అరేబియా నావికాదళ కూటమి
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై చూపే ప్రభావం
ఈ కీలక ఇంధన స్థావరాలపై ఇరాన్ గనుక దాడి చేస్తే, దాని ప్రభావం కేవలం మిడిల్ ఈస్ట్‌కే పరిమితం కాదని సైనిక విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయి, గ్లోబల్ ఎకానమీ ,సరఫరా వ్యవస్థ (సప్లై చైన్) పూర్తిగా కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది.
ఇంతకుముందు 40 రోజుల పాటు జరిగిన ఘర్షణల్లో ఇరాన్‌కు చెందిన సౌత్ పార్స్ ప్రాంతంపై దాడి జరిగినప్పుడు, దానికి ప్రతికారంగా ఖతార్‌లోని అత్యంత ముఖ్యమైన గ్యాస్ రిఫైనరీపై బాంబుల వర్షం కురిపించినట్లు ఇరాన్ గుర్తుచేసింది. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా స్పందిస్తూ.. ఇటువంటి పొరపాటు మళ్లీ పునరావృతం కాదని హామీ ఇచ్చారని ఇరాన్ వర్గాలు తెలిపాయి. తాజాగా ఇరాన్ ఇచ్చిన ఈ తీవ్ర హెచ్చరికలతో వాషింగ్టన్, టెల్ అవీవ్, గల్ఫ్ దేశాలు అప్రమత్తమై అత్యవసర సమావేశాలు నిర్వహిస్తున్నాయి.









