Women’s Asia Cup 2026 : చాలాకాలంగా దాయాది దేశాలుగా ఉన్న భారత్‌, పాకిస్థాన్‌ దేశాల మధ్య మరో క్రికెట్‌ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. అయితే అది పురుషుల జట్లు మాత్రం కాదు. ఇటీవల జరిగిన ఐపీసీ మహిళా టీ20 ప్రపంచ కప్‌ సమయంలో రెండు దేశాల క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఉత్కంఠతో మ్యాచ్‌ ను తిలకించారు. పురుషజట్టుకు వచ్చినంత క్రేజ్‌ తొలిసారి మహిళా జట్టుకు రావడం గమనార్హం. అంతగా ఆకట్టుకున్న మహిళా క్రికెట్‌ మ్యాచ్‌ కు మరోసారి రంగం సిద్ధమైంది. త్వరలోనే మహిళల క్రికెట్ లో మరో కీలక మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది.

పాకిస్థాన్‌, ఇండియా దేశాల మహిళల టీ20 ఆసియా కప్‌ 2026 టోర్నీ త్వరలో జరగనుంది. దీనికి సంబంధించి ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) ఆయా సభ్య దేశాలకు అంతర్గతంగా తేదీలను వెల్లడించినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ టోర్నమెంట్‌ ఈ నెల 28 నుంచి సెప్టెంబర్‌ 13 వరకు జరగనున్నట్లు తెలుస్తోంది. గతంలో లాగే ఈ రెండు జట్ల మధ్య జరిగే సమరం మరింత ఆకట్టుకుంటుందని క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Also Read : వాషింగ్టన్‌లో ఉగ్రరూపం దాల్చిన కార్చిచ్చు: అత్యవసర పరిస్థితి విధింపు

అయితే ఈ మ్యాచ్‌ మాత్రం ఈ రెండు దేశాలలో జరిగే అవకాశం లేదని తెలుస్తుంది. ఇరు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు యూఏఈ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఎన్ని మ్యాచులు, ఎక్కడెక్కడ ఏ వేదికల మీద జరుగుతాయనే విషయాలను మాత్రం ఏసీసీ అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. ఇక ఈ పొట్టి ఫార్మాట్‌ కేవలం ఆసియా ఖండానికి సంబంధించింది మాత్రమే కావడం వల్ల ఇందులో భారత్‌, పాకిస్థాన్‌తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాల్‌, మలేసియా, థాయ్‌లాండ్‌, యూఏఈ తదితర జట్లు పోటీపడే అవకాశం ఉంది.

ఇక పురుషుల జట్టుతో సమానంగా రాణిస్తున్న భారత మహిళా క్రికెట్‌ టీం మరోసారి పాకిస్థాన్‌తో తలపడనుండటంతో మరోసారి పాకిస్థాన్‌, భారత మహిళల మ్యాచ్‌ చూసే అవకాశం లభించనుందని క్రికెట్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏసీసీ పూర్తి షెడ్యూల్ రిలీజ్ చేస్తే మ్యాచ్‌ కు సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది.

కాగా దీనికి సంబంధించిన వివరాలను ఏసీసీ సభ్య దేశాలకు పంపిన సమాచార ప్రకారం.. 28న జరిగే మ్యాచ్‌ కోసం అన్నీ జట్లు ఆగస్టు 27న యూఏఈకి చేరుకోవాలని సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌ 13న ఫైనల్‌ మ్యాచ్‌ నిర్వహించాలని నిర్ణయించారు. కాగా ఇప్పటివరకు ఆసియా కప్‌లో భారత్‌నే ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ లలో టీమిండియా ఏడు టైటిళ్లు గెలుచుకుంది. అయితే 2024లో మాత్రం శ్రీలంకతో జరిగిన ఫైనల్లో భారత్‌ ఓడిపోయిన విషయం తెలిసిందే.

Also Read : పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. ఆగస్టు 11న స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రకటించిన బలూచిస్థాన్!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.