
Houthi Attack On Saudi Arabia : సౌదీ అరేబియాలో -హూతీల దాడులు తీవ్ర మయ్యాయి. గత కొంతకాలంగా రెండు వర్గాల మధ్య పోరు తీవ్రరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో మరోసారి సౌదీ అరేబియాపై హౌతీ తిరుగుబాటుదారులు భారీ దాడులకు తెగబడ్డారు. దేశంలోని దక్షిణ ప్రాంతాల్లో ఉన్న పలు పౌర, ఆర్థిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేయడం కలకలం రేపింది. మంగళవారం తెల్లవారుజామున హూతీలు జరిపిన దాడుల్లో 73 మంది గాయపడినట్లు తెలుస్తోంది. హూతీలు అబ్హా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కింగ్ ఖాలిద్ ఎయిర్‌బేస్, ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం అరామ్‌కోలను టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అబ్హా, జిజాన్ ప్రాంతాల్లోని అరామ్కో సౌకర్యాలపై దాడులు జరిగినట్లు సౌదీ అధికారులు అంగీకరించారు. ఈ దాడుల కారణంగా పలు ప్రాంతాల్లో మంటలు చెలరేగినట్లు వెల్లడించారు. కొన్ని ఇంధన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చినట్లు సౌదీ ఇంధన మంత్రిత్వ శాఖ తెలిపింది. జిజాన్‌లోని కీలక చమురు రిఫైనరీ కూడా దాడికి గురైనట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి.
Also Read : ఇరాన్‌పై గెలిస్తే పెట్రోల్ ధరలు భారీగా తగ్గుతాయ్: ట్రంప్ సంచలన ప్రకటన!
కాగా హూతీల దాడులకు ప్రతిస్పందనగా తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సౌదీ అరేబియా తేల్సి చెప్పింది. హూతీల దాడులను అడ్డుకోవడంతో పాటు ముప్పు మూలాలను నిర్వీర్యం చేస్తామని సౌదీ అరేబియా హెచ్చరించింది. యెమెన్‌లో సౌదీ మద్దతున్న ప్రభుత్వం, ఇరాన్ మద్దతున్న హూతీల మధ్య పోరు మళ్లీ తీవ్రరూపం దాల్చడంతో ఈ దాడులు సాగుతున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు రోజు యెమెన్‌లోని జైలుపై సౌదీ వైమానిక దాడి చేసిందని హూతీలు ఆరోపిస్తున్నారు. హజ్మ్ నగరంలోని సెంట్రల్ కరెక్టివ్ ఫెసిలిటీసెంటర్ పై సౌదీ చేసిన దాడిలో ఓ చిన్నారి సహా ఏడుగురు మృతి చెందినట్లు హూతీల ఆరోగ్య శాఖ ప్రతినిధి అనీస్ అల్ అస్బాహీ ఆరోపించారు. మరో ఏడుగురు గాయపడ్డారని ఆయన వెల్లడించారు. దాడి మూలంగా శిథిలాల కింద 35 మంది ఖైదీలు, భర్తను కలిసేందుకు వచ్చిన ఓ మహిళ చిక్కుకున్నట్లు వెల్లడించారు.
సౌదీ దాడిలో జైలు భవనం కూప్పకూలిన దృశ్యాలను హూతీ అధికారిక టీవీ ఛానల్ ప్రసారం చేయడం గమనార్హం. కుప్పకూలిన భవనం శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం కొనసాగుతున్న సహాయక చర్యలను ఆ వీడియోలో చూపించారు. కాగా, దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని హూతీల సైనిక ప్రతినిధి యాహ్యా సరీ హెచ్చరించారు. అదే సమయంలో గత 24 గంటల్లో సౌదీకి చెందిన నాలుగు నిఘా డ్రోన్లను కూల్చినట్లు కూడా ఆయన వెల్లడించారు. సౌదీ దాడుల నేపథ్యంలో ఆ దేశానికి చెందిన నౌకలు ఎర్ర సముద్రం గుండా వెళ్లకుండా తాము సముద్ర దిగ్బంధనం విధిస్తున్నట్లు ప్రకటించారు. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే.. తీవ్ర పరిణామాలు తప్పవని హుతీలు హెచ్చరించారు. సౌదీ దాడుల కారణంగా తమ ప్రాంతాల్లో తీవ్ర ప్రాణనష్టం జరిగిందని ఆరోపిస్తూ, తాజా దాడులు దానికి ప్రతిస్పందనగా చేపట్టినవేనని హౌతీలు వార్నింగ్ ఇచ్చారు. కాగా, సౌదీ చమురు మౌలిక సదుపాయాలపై దాడులు అంతర్జాతీయ చమురు మార్కెట్లపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 98 డాలర్ల పైకి చేరినట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
మరోవైపు హూతీలు జరిపిన దాడుల్లో చాలా మంది ప్రజలు తీవ్రంగా గాయాలపాలైనట్లు సౌదీ నేతృత్వంలోనిసంకీర్ణ దళాల ప్రతినిధి టుర్కీ అల్ మల్కి తెలిపారు. గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు పేర్కొన్నారు. దాడులకు దీటుగా బదులిస్తామని హెచ్చరించారు.
Also Read : సైన్యంలో చేరాలని ఒత్తిడి… రష్యా పోలీసుల అదుపులో యూపీ ఇంజినీర్..!








