ayudha puja mythological stories history
ayudha puja mythological stories history

రేపు దసరా పండుగను తెలుగు ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకోనున్నారు. కొత్త కొత్త బట్టలు ధరించి.. ఇంట్లో పూజలు చేసుకోనున్నారు. ముఖ్యంగా వాహనాలు, పుస్తకాలు, ల్యాప్‌టాప్‌లు, ఆయుధాలు, వృత్తి సంబంధిత సామాగ్రికి పూజలు చేయనున్నారు. అయితే ఈ దసరా నవరాత్రి ఉత్సవాల్లో మాత్రమే ఆయుధ పూజ ఎందుకు చేస్తారు?.. దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక కథ ఏంటి?.. రేపు (అక్టోబర్ 20) ఏ సమయంలో పూజలు చేయాలి? అనేది ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

ముందుగా.. రేపు దసరా వేడుకల సమయంలో ఆయుధ పూజను ఏ శుభముహూర్తంలో చేయాలో చూద్దాం..

విజయదశమి: అక్టోబర్ 20, మంగళవారం
విజయ ముహూర్తం: మధ్యాహ్నం 1.59 నుంచి 2.45 గంటల వరకు
పూజ టైం: 46 నిమిషాలు.

ఆయుధ పూజ ఎందుకు చేయాలి?

జీవనోపాధి కోసం ఉపయోగించే పనిముట్లు, యంత్రాలు, వాహనాలు సహా ఇతర సామగ్రి, ఆయుధాలను దైవస్వరూపంగా భావిస్తారు. మనకు విజయాన్ని, సంపదను అందించే వృత్తి సామాగ్రిని పూజించడం ద్వారా వాటిపై దైవ కృప ఉంటుందని నమ్ముతారు.

పురాణ కథలు

  • మరోవైపు విజయదశమి రోజు ఆయుధ పూజ వెనుక పురాణ కథలు కూడా ఉన్నాయి. మహాభారతంలో పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టు డొల్లలో దాచిపెట్టి అజ్ఞాతవాసానికి వెళ్తారు. అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత.. విజయదశమి రోజున ఆ ఆయుధాలను బయటకు తీసి జమ్మి చెట్టు వద్ద పూజించి.. కౌరవులతో యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో పాండవులు విజయం సాధించడం వల్లనే ఈ రోజున ఆయుధ పూజ చేయడం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.
  • ఇది మాత్రమే కాకుండా.. దుర్గాదేవి మహిషాసురుడితో 9 రోజులు భీకర యుద్ధం చేసి 10వ రోజు విజయం సాధించింది. ఆ యుద్ధంలో దేవతలందరూ తమ ఆయుధాలను.. అమ్మవారికి శక్తి రూపంలో అందించారు. ఆ యుద్ధం ముగిసిన తర్వాత చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఆయుధాలను పూజించడం ఆనవాయితీగా వస్తోంది.