Kriti Sanon :  బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ యాక్ట్ చేసిన రాఖీ పండుగ యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద గొడవకు కారణమైంది. ఆ యాడ్‌లో ఆమె వేసుకున్న బట్టలు, పండుగను చూపించిన పద్ధతి బాగాలేదని కొందరు విమర్శించారు. దీనికి కృతి సనన్ గట్టిగా బదులిచ్చారు. పండుగలను ఎవరూ బట్టలతో పోల్చకూడదని, సంప్రదాయాలు మనసులో ఉండాలి కానీ బట్టల డిజైన్‌లో కాదని ఆమె చెప్పారు.

Also Read : వివాదంలో ఇరుముడి చిత్రం.. ఆ సీన్లను తొలిగించాలంటూ డిమాండ్!

ఈ పండుగ తనకు ఎందుకు ఇష్టమో ఆమె వివరించారు. పండుగ అంటే బట్టలు కాదని, మనసులోని భావాలు, ఆచారాలే ముఖ్యమని తెలిపారు. రాఖీ అంటే రక్షణ బంధం అని, తాను, తన చెల్లెలు ఒకరికొకరం రాఖీ కట్టుకుంటామని చెప్పారు. మాకు ఒకరికొకరం రక్షణగా ఉంటామని రాశారు. అలాగే, యాడ్‌లో తన పెంపుడు కుక్కకు రాఖీ కట్టడంపై వస్తున్న విమర్శలకూ ఆమె బదులిచ్చారు. మా కుక్క కూడా మా కుటుంబంలో భాగమేనని, అందుకే దానిని కూడా చేర్చినట్లు తెలిపారు. ఈ యాడ్‌లో కృతి మోడరన్ బట్టలు వేసుకుని రాఖీ పండుగ చేసుకున్నట్లు చూపించారు.

మహిళలు ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పడం ఎప్పుడు మానేస్తారని కృతి ప్రశ్నించారు. ఫ్యాషన్ మారుతున్నా, ఒక మహిళ సంస్కృతిని గౌరవిస్తుందా లేదా అని ఆమె బట్టలను చూసే ఎందుకు కొలుస్తారని మండిపడ్డారు. ఈ యాడ్‌పై నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కూడా విమర్శలు చేశారు. రాఖీ పండుగ రోజు అలాంటి బట్టలు వేసుకుని రాఖీ కట్టడం ఏంటని ఆమె ప్రశ్నించారు. ఈ యాడ్ చాలా తప్పుగా ఉందని అన్నారు.

కాగా సినిమాల విషయానికి వస్తే, కృతి సనన్ ఇటీవలే షాహిద్ కపూర్, రష్మిక మందన్నలతో కలిసి కాక్‌టెయిల్ 2 సినిమాలో నటించారు. అలాగే 2025లో ధనుష్ సరసన తేరే ఇష్క్ మేమ్ చిత్రంలో కూడా నటించారు.

Also Read : తెలుగు సినిమాలకు గోల్డెన్ టైమ్.. 62 రోజులు 6 హిట్లు.. దర్శకులే కింగ్!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.