
Lord Ganesh : బెంగళూరులో విచిత్రమైన చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. వినాయక చవితి సందర్భంగా అమ్మకానికి రోడ్డుపక్కన ఉంచిన గణేశుడి విగ్రహాన్ని నలుగురు వ్యక్తులు ఎత్తుకెళ్లారు. తెల్లవారుజామున అంతా నిద్రలో ఉన్న సమయంలో వచ్చిన దుండగులు.. ఎవరూ లేని సమయం చూసి విగ్రహాన్ని వాహనంలో వేసుకుని అక్కడి నుంచి పారిపోయారు. అయితే వారి చోరీ వ్యవహారం మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున 3.51 గంటల సమయంలో బెంగళూరులోని మగడి రోడ్డులో దాసరహళ్లి ప్రాంతంలో జరిగింది. ఓ దుకాణం వద్ద గణేశుడి విగ్రహాలను అమ్మేందుకు రోడ్డుపక్కన ఉంచారు. తెల్లవారుజామున టాటా ఏస్ గూడ్స్ వాహనంలో వచ్చిన నలుగురు వ్యక్తులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. సీసీ కెమెరా ఫుటేజీలో నలుగురు వ్యక్తులు వాహనం నుంచి దిగినట్లు కనిపించింది. అనంతరం వారు నేరుగా గణేశుడి విగ్రహం దగ్గరకు వెళ్లారు.
Also Read : భర్తలకు షాక్.. పిల్లలతో కలిసి ఇద్దరు మహిళలు జంప్.. నగలు, నగదు కూడా మాయం!
చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా అని గమనించిన తర్వాత.. విగ్రహాన్ని కలిసి ఎత్తుకున్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా దాన్ని టాటా ఏస్ వాహనంలోకి ఎక్కించారు. విగ్రహాన్ని వాహనంలో పెట్టిన వెంటనే నలుగురూ అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారు. ఇదంతా కేవలం కొన్ని నిమిషాల్లోనే జరిగినట్లు సీసీ కెమెరా దృశ్యాలను బట్టి తెలుస్తోంది. ఉదయం దుకాణం వద్దకు వచ్చిన వారు విగ్రహం కనిపించకపోవడంతో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించారు.
ఈ ఘటనపై మగడి రోడ్ పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అక్కడి సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు. టాటా ఏస్ వాహనం నంబర్, అందులో ఉన్న వ్యక్తుల వివరాలను గుర్తించే పనిలో ఉన్నారు. విగ్రహాన్ని ఎత్తుకెళ్లిన నలుగురు వ్యక్తులు ఎవరు? వారు ఎక్కడి నుంచి వచ్చారు? విగ్రహాన్ని ఎందుకు చోరీ చేశారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
Also Read : త్రిషపై ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్.. సీఎం విజయ్ స్ట్రాంగ్ వార్నింగ్!









