pak

Pakistan :  పహల్గామ్ ఉగ్రదాడి తరువాత పాక్‌ నుంచి అన్ని రకాల ఉత్పత్తుల దిగుమతిని భారత్‌ నిషేధించిన సంగతి తెలిసిందే. ఇంత జరిగిన పాక్ తన బుద్ది మాత్రం మార్చుకోలేదు. డైరెక్ట్ గా కాకుండా మూడో దేశాల ద్వారా భారత్ కు పంపించే ప్రయత్నాలను చేస్తోంది. ఈ క్రమంలోనే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ గట్టి నిఘా పెట్టి ఏకంగా సుమారు 364 మిలియన్‌ టన్నుల ఎండుఖర్జూరం దిగుమతిని స్వాధీనం చేసుకుంది. దీని విలువ రూ.3 కోట్లుగా ఉంటుందని సమాచారం.

భారత్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాకిస్తాన్ నుండి నేరుగా లేదా పరోక్షంగా ఏ రకమైన వస్తువులను దిగుమతి చేసుకోవడంపై పూర్తిగా నిషేధం. అయితే ఆంక్షలను తప్పుదారి పట్టించడానికి పెద్దప్లా్న్ వేశారు. అదే రూట్ ఛేంజ్ అన్నమాట. ముందుగా పాకిస్తాన్ నుండి ఖర్జూరాలను దుబాయ్ దేశానికి పంపారు. అక్కడ ఆ సరుకును వేరే కంటైనర్లలోకి మార్చారు. ఆ తర్వాత ఆ ఖర్జూరాలు దుబాయ్ నుంచే వచ్చాయని ఫేక్ లెటర్లు సృష్టించి ఇండియాలోని కాండ్లా పోర్టుకు పంపారు.

Also Read : ఉక్రెయిన్ వీధుల్లో రష్యన్ డ్రోన్ హంటింగ్.. వ్యాపారిని వెంటాడిన డ్రోన్లు.. ఎలా ఎటాక్ చేస్తాయంటే?

ఈ విషయం తెలుసుకున్న డీఆర్ఐ అధికారులు ముందస్తు కాండ్లా పోర్టులో ఉన్న 13 కంటైనర్లను ఆపి సెర్చ్ చేయగా అసలు విషయం బయటపడింది. ఆ సరుకు దుబాయ్ నుండి కాదనీ, పాకిస్తాన్ నుండి వచ్చింది అని తేలింది. దీంతో కస్టమ్స్ చట్టం 1962 కింద ఆ మొత్తం 364 మెట్రిక్ టన్నుల ఖర్జూరాలను అధికారులు సీజ్ చేశారు. గత వారం ట్యుటికోరిన్ పోర్టులో కూడా డీఆర్ఐ అధికారులు ఇలాంటిదే మరో అక్రమ రవాణాను భగ్నం చేశారు. ఈ సరుకు సోమాలియా దేశం నుంచి వచ్చిందని తప్పుగా చెప్పి, దుబాయ్ మీదుగా అక్రమంగా తరలిస్తున్నారు. విచారణలో అది కూడా పాకిస్తాన్ సరుకేనని తేలడంతో, దాన్ని సీజ్ చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.

కాగా పహల్గామ్‌లో జరిగిన భీకర ఉగ్రదాడికి మోదీ సర్కార్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. దశాబ్దాల నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ తక్షణమే నిలిపివేసింది. ఇప్పటికి ఇది కంటిన్యూ అవుతుంది. పాకిస్తాన్ నుంచి నేరుగా లేదా మూడో దేశాల ద్వారా జరిగే అన్ని రకాల దిగుమతులు, ఎగుమతులు రవాణాపై నిషేధం విధించారు. పంజాబ్‌లోని అట్టారి-వాఘా సరిహద్దు చెక్‌పోస్ట్‌ను ప్రయాణాలను వెంటనే మూసివేశారు.

Also Read : విదేశీ జర్నలిస్టులకు పాక్ బిగ్ షాక్.. గుట్టు రట్టు అవుతుందని కొత్త రూల్.. అదేంటంటే?

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.